ETV Bharat / politics

వారానికి 2 రోజులు 'మంత్రులతో ప్రజల ముఖాముఖి' - 2 వారాలకు ఓసారి డైరెక్ట్​గా సీఎంనూ కలవొచ్చు - telangana Ministers Meet People

Ministers Meet with People : తెలంగాణ కాంగ్రెస్‌ సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతోంది. ఈ నెల 25 నుంచి గాంధీభవన్​లో 'మంత్రులతో ప్రజల ముఖాముఖి' కార్యక్రమం ప్రారంభం కానుంది. వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాల్లో మూడు గంటల పాటు గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉండేటట్లు పీసీసీ కార్యాచరణ సిద్ధం చేసింది. కొత్తగా నియమితులైన పీసీసీ అధ్యక్షులు మహేశ్​ కుమార్‌ గౌడ్‌ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు.

Ministers Meet with People and Party Workers
Ministers Meet with People and Party Workers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 9:20 AM IST

Updated : Sep 24, 2024, 7:44 PM IST

Public Face to Face with Ministers : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డిలు ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్‌లో మంత్రులు, సీఎం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని ముందు నుంచి పార్టీ నుంచి డిమాండ్‌ వస్తోంది. ఈ నెల 15వ తేదీన మహేశ్​కుమార్‌ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీని బలోపేతం చేసేందుకు వారంలో రెండు రోజులు మంత్రులు, రెండు వారాలకు ఒక్క రోజు సీఎం రేవంత్‌ రెడ్డి గాంధీ భవన్‌లో ఉండేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత ఇదే అంశంపై ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌లు దాదాపు 2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం చేపట్టాలన్న ఆలోచన రావడం కూడా మంచి శుభపరిణామమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుందని అభిప్రాయపడినట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులతో కూడా చర్చించిన తర్వాత ఈ సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ప్రతి రోజు గాంధీభవన్‌లో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. పూర్తిస్థాయి పీసీసీ అధ్యక్షుడు కావడంతో పార్టీని బలోపేతం చేయడం ఎలా? కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే దానిని ఏ విధంగా పరిష్కారం చేయాలి? తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

గాంధీ భవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం ఈ నెల 25 (రేపటి) నుంచి అందుబాటులోకి వస్తుందని పీసీసీ ప్రకటించింది. వారంలో ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం గాంధీభవన్‌లో ఓ మంత్రి అందుబాటులో ఉంటారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోజుకు 3 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి గాంధీభవన్‌లో మొదలు కానుంది. తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని మంత్రులతో ప్రజల ముఖాముఖిగా నామకరణం చేశారు.

మంత్రుల షెడ్యూల్​ ఖరారు : దీనిపై వచ్చే స్పందనను దృష్టిలో ఉంచుకుని మార్పులు, చేర్పులు చేస్తారని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశం తర్వాత సీఎంతో చర్చించిన పీసీసీ అధ్యక్షుడు, గాంధీ భవన్‌లో మంత్రులు ప్రజలతో ముఖాముఖి షెడ్యూల్‌ను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్షుడికి, మంత్రులకు మధ్య తత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్లు సైతం ఈ కార్యక్రమం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై ప్రశంసిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ బలోపేతానికి కార్యాచరణ చేపట్టారని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ను బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచే కార్యకర్తల్లో ఉత్సాహంనింపడం మొదలైంది.

అక్టోబరు 30వ తేదీ వరకు మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ ఇదే :

  • 25-09-2024 - దామోదర​ రాజనర్సింహ
  • 27-09-02024 - శ్రీధర్​ బాబు
  • 04-10-2024 - ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
  • 09-10-2024 - పొన్నం ప్రభాకర్​
  • 11-10-2024 - సీతక్క
  • 16-10-2024 - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • 18-10-2024 - కొండా సురేఖ
  • 23-10-2024 - పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి
  • 25-10-2024 - జూపల్లి కృష్ణారావు
  • 30-10-2024 - తుమ్మల నాగేశ్వరరావు

హైడ్రాకు ఫుల్​ పవర్స్​ - జనవరి నుంచి అన్ని రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం - తెలంగాణ కేబినెట్​ భేటీ నిర్ణయాలు ఇవే - Telangana Cabinet Meeting 2024

దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University

Last Updated : Sep 24, 2024, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.