ETV Bharat / politics

'కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ ఆపలేరు' - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Minister Sridhar Babu Election Campaign in Peddapalli : ఇతర పార్టీ నేతల గురించి మాట్లాడే సమయం కాంగ్రెస్​కు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఎవరూ ఆపలేరని తెలిపారు. మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి వంశీను ఎంపీగా గెలిపించాలని కోరారు.

Sridhar Babu on BRS Past Ruling
Minister Sridhar Babu Election Campaign in Manthani
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 4:00 PM IST

Minister Sridhar Babu Election Campaign in Manthani : ఇతర పార్టీ నేతల గురించి మాట్లాడే సమయం కాంగ్రెస్​కు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎవరూ ఆపలేరని తెలిపారు. మూడు నెలల్లో మంథనిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పెద్దపల్లి లోక్​సభ అభ్యర్థి వంశీ ప్రజాసేవ చేయడానికే ముందుకు వచ్చారని, ఆయనకు నియోజకవర్గంలోని యువత అండగా నిలిచి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఎంపీగా గెలిచిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు తీసుకువస్తారని హామీ ఇచ్చారు.

ఏకతాటిపైకి వచ్చిన పెద్దపల్లి కాంగ్రెస్‌ నేతలు - పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ - peddapalli cong Leaders On victory

Sridhar Babu on BRS Past Ruling : తను ఒక రాజకీయ నాయకుడినన్న ఆయన మంచి పనుల కోసం తప్పకుండా రాజకీయం చేస్తానని అన్నారు. తన తండ్రి మృతి చెందిన నాటి నుంచి ఇప్పటి వరకు తమ కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై, వారి కుటుంబంపై ఎన్ని రకాల దూషణలు చేసినా పట్టించుకోమని, ప్రజాసేవలో ఉన్నప్పుడు అలాంటివి పడాల్సి వస్తుందన్నారు.

రైతుల పేరిట బీఆర్ఎస్ దొంగ దీక్షలకు దిగింది : మంత్రి శ్రీధర్​ బాబు - Minister Sridhar babu on BRS Party

Congress MP Candidates Election Campaign : మంథని నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, ఇంకా తన తండ్రి అడుగుజాడల్లో నడవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీలో తనకు మంత్రి పదవి దక్కిందని శ్రీధర్ బాబు తెలిపారు. తాను చెప్పే మనిషిని కాదని, పనులను చేసి చూపించే వ్యక్తి అని అన్నారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశంతో రాష్ట్రంలో మంచి నాయకుడిగా ఉంటూ ప్రజాసేవలో ఉంటానని చెప్పారు. తనపై రాజకీయంగా ఎంతో మంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని ఎదుర్కోవడం తన బాధ్యతన్నారు. మంథని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ వల్ల పెద్దపల్లి ప్రాంతం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ - lok sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.