ETV Bharat / politics

'ఆ రెండు పనులు నేను చేయలేను, ఆ విషయంలో నా దగ్గరకు రాకండి'

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు - ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు బదిలీల కోసం తన దగ్గరకు రావొద్దని విజ్ఞప్తి - బదిలీల విషయంలో తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్న మంత్రి

TRANSPORT MINISTER PRABHAKAR
MINISTER PONNAM HOT COMMENTS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Minister Ponnam Comments : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీల కోసం తన వద్దకు రావొద్దని సూచించారు. ఈ రెండు విషయాలలో తనపై ఒత్తిడి తేవద్దని కోరారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం కొన్ని వందల వేల మంది వస్తున్నారన్నారు. ఆర్టీసీకి సంబంధించిన మంత్రిని అయినా కూడా బదిలీల విషయంలో తానేమి చేయలేనన్నారు. ఈ రెండు పనులు తప్ప హుస్నాబాద్​ శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో మిగతా అభివృద్ధి పనులు చేస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కులగణను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్​లో మంత్రి కుల గణన సర్వేను పరిశీలించారు. సర్వే ఎలా కొనసాగుతుందని అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

దేశవ్యాప్తంగా కులగణన చేయాలి : బుద్ధి, జ్ఞానం లేనోళ్లు రాహుల్ గాంధీ కులం ఏంటని మాట్లాడుతున్నారని, ఆయన కులం కావాలంటే దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేస్తే తెలిస్తుందన్నారు. కులగణనకు బీజేపీ దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఎవరైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. రాహుల్​ గాంధీ కులం గురించి మాట్లాడుతున్నారంటే వారికి భయం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న కులగణన ద్వారా వ్యవస్థ గురించి పూర్తి సమాచారం తెలుస్తుందని వెల్లడించారు. సర్వేపై అక్కసుతోనే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కులం అడగడంలో బీజేపీకి ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

దసరాకు ఈ ప్రతిజ్ఞ చేద్దాం - వాహనదారులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి

'ధర్నాలెందుకు చేస్తున్నరు - టెన్షనొద్దు, తొందర్లోనే బకాయిలు చెల్లిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.