ETV Bharat / politics

ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్​ పడిపోతుంది - అందుకే మోదీ ముఖంలో భయం : మంత్రి పొన్నం - Minister Ponnam Press Meet - MINISTER PONNAM PRESS MEET

Minister Ponnam Prabhakar Fires on PM Modi : ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్​ పడిపోతుందని, అందుకే మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. అర్బన్​ టెర్రరిస్టులా మోదీ మాట్లాడుతున్నారన్నారు. కరీంనగర్​ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ మీడియా సమావేశం నిర్వహించారు.

Minister Ponnam Prabhakar Fires on PM Modi
Minister Ponnam Prabhakar Fires on PM Modi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 12:25 PM IST

Updated : May 11, 2024, 12:59 PM IST

Minister Ponnam Prabhakar Press Meet : కాంగ్రెస్​ విజయం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి అవసరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. మార్పు కోరుకుని మీరు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేయాలంటే కాంగ్రెస్​ను ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరుకున్నారు. కరీంనగర్​ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ మీడియా సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం కూలిపోతుందని పిల్లి శాపనార్ధాలు పెట్టిన వాళ్లకు ఓటర్లు సమాధానం చెప్పే తీర్పునని మంత్రి పొన్నం ప్రభాకర్​ ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, రూ.500లకే గ్యాస్​ సిలిండర్​, ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నామని చెప్పారు. కోడ్​ ముగియగానే కొత్త రేషన్​ కార్డులు, కొత్త ఫించన్లు, ఇప్పుడున్న ఫించన్లు పెంచుతామని మాటిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు రూ.2500 అమలు చేస్తామని అన్నారు.

మతతత్వంతో గెలవాలని చూస్తోంది : గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల దగ్గరున్న సమస్యలన్నీ తీర్చి సాగునీరందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. దేశం సంక్షిష్ట దశలో భారదేశం నా మాతృదేశమని ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. పైకి జై శ్రీరామ్ అంటూనే లోపల రిజర్వేషన్లకు రామ్​ రామ్​ చెప్పేందుకు బీజేపీ వాళ్లు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మతతత్వంతో గెలవాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు.

'కరీంనగర్​లో మేమంతా ఐక్యంగా పని చేశాం. మా గెలుపు తథ్యం. కరీంనగర్​ నుంచి మాకు బలాన్ని ఇవ్వండి. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. సిరిసిల్ల సంక్షోభంలో పడినా టెక్స్​టైల్​ జోన్​ను వరంగల్​కు తరలించినా అప్పటి ఎంపీ వినోద్​ పట్టించుకోలేదు. బండి సంజయ్​ వివాదాల్లో ప్రాచుర్యం పొందినా ఎంపీగా కరీంనగర్​కు ఏం చేయలేదు. మీరే కాదు మేము పక్కా, కచ్చా లోకల్' అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

బీజేపీ గ్రాఫ్​ రోజురోజుకీ పడిపోతుంది : తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించినప్పుడు ఈ పక్కా లోకల్​ ఎటు పోయారని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తాము ఆనాడు తెలంగాణ కోసం పార్టీతోనే కొట్లాడామని గుర్తు చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించామని మోదీ మాట్లాడితే పార్లమెంటులోనే ఉన్న బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్​ పడిపోతోందని స్పష్టం చేశారు. ఏ ప్రధాని మాట్లాడనంత నీచంగా మోదీ మాట్లాడుతున్నారన్నారు. హిందువుల సంపద ముస్లింలకు పంచుతారని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రక్తపాతం సృష్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు.

"అర్బన్​ టెర్రరిస్టులాగా మోదీ మాటలు ఉన్నాయి. మోదీ ముఖంలలో భయం కనిపిస్తోంది. అద్వానీ మీద నుంచి నడిచొచ్చి మోదీ ప్రధాని అయ్యారు. వేములవాడలో పీవీ గురించి మోదీ మాట్లాడారు. ఆయన గురించి మాట్లాడే కనీస అర్హత మోదీకి లేదు. శివాజీ విగ్రహాలు ఎన్నికలప్పుడే బీజేపీకి గుర్తుకు వస్తాయి. కేసీఆర్​ ఏ పార్టీని వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. 400 సీట్లు అడిగి రాజ్యాంగం మార్చాలని చూస్తోన్న బీజేపీపై కేసీఆర్​ వైఖరి చెప్పాలి. కాంగ్రెస్​ మాత్రమే దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది." - పొన్నం ప్రభాకర్​, మంత్రి

ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్​ పడిపోతుంది - అందుకే మోదీ ముఖంలో భయం : మంత్రి పొన్నం (ETV Bharat)

రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది : మంత్రి పొన్నం - Minister Ponnam fires On BJP

మీరిచ్చిన హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం - బండి సంజయ్​కి పొన్నం సవాల్ - PONNAM CHALLENGES BANDI SANJAY

Last Updated : May 11, 2024, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.