ETV Bharat / politics

'ఇప్పుడు రాజధాని, తర్వాత అన్ని జిల్లాల్లో కూల్చివేతలు - అక్రమంగా కడితే వదిలేది లేదు' - Ponnam On Hydra project - PONNAM ON HYDRA PROJECT

Minister Ponnam Prabhakar on Hydra Demolitions : హైదరాబాద్​లో చెరువుల పరిరక్షణకు హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాజధాని అనంతరం రాష్ట్రవ్యాప్తంగా చెరువులను కబ్జా చేసి అక్రమంగా కట్టుకున్న నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. ఇదంతా చెరువుల పరిరక్షణకే అని పేర్కొన్నారు.

Minister Ponnam Prabhakar on Hydra Project
Minister Ponnam Prabhakar on Hydra Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 2:54 PM IST

Updated : Aug 26, 2024, 4:26 PM IST

Minister Ponnam Prabhakar on Hydra Project : చెరువుల పరిరక్షణకు హైదరాబాద్​తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతాయని రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్​లో హైడ్రా కూల్చివేతల​పై స్పందించిన ఆయన రాష్ట్రంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు. తెలంగాణలో ముందుగా రాజధాని నగరంలో తర్వాత అన్ని జిల్లాల్లో ఏఏ చెరువులు ఆక్రమణకు గురయ్యాయో గుర్తిస్తారని, తర్వాత వాటి పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుంచి పరిరక్షించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.

గంతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వం లెక్కలకు అనుగుణంగా కూల్చివేతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు, గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన వారు ఏవరైనా పోలీసు అధికారులు, రెవెన్యూ, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెరువుల పరిరక్షణ స్థానికులదేనని ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయదన్నారు.

కూల్చివేతలపై హైడ్రా నివేదిక - లిస్టులో ప్రముఖులకు చెందిన నిర్మాణాలు - ఎవరెవరివి ఉన్నాయంటే? - HYDRA REPORT ON DEMOLITIONS

"తెలంగాణ రాష్ట్రంలో ముందుగా హైదరాబాద్​లో తదుపరి అన్ని జిల్లాల్లో ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో వాటిని పునరుద్ధిరించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. భౌగోళిక పరిస్థితులను కాపాడుకుంటూ కాలుష్యాన్ని తగ్గించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన వారు ప్రభుత్వానికి కానీ, అధికారులు, పాత్రికేయుల దృష్టికి తీసుకురావాలి." - పొన్నం ప్రభాకర్​, మంత్రి

ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ : హైడ్రా కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్శిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే న్యాయ స్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు. చెరువులు ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్​గా ఉందన్నారు. హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీగా ఉండేదని దానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. చెరువుల పరిరక్షకులు అందరూ ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో వాటి ఆధారాలు ఆనవాళ్లు సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరారు.

33 జిల్లాల్లో ఎక్కడైనా గ్రామాలు, మండలాలు, పట్టణాలు, మున్సిపాలిటీ చెరువులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల్లో మీకున్న అవగాహన, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి - MLC Jeevan Reddy On Hydra

ఆరంభ శూరత్వం కాదు - కూల్చివేతలు ఇలాగే కొనసాగాలి : సీపీఐ నారాయణ - CPI Narayana Visit N Convention

Last Updated : Aug 26, 2024, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.