ETV Bharat / politics

కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్​ సమర్థిస్తారా : మంత్రి సురేఖ - Surekha Fires on brs social media

Minister Konda Surekha Comments on BRS : కవిత పట్ల ఎవరైనా అవమానిస్తూ పోస్టులు పెడితే కేటీఆర్​ ఊరుకుంటారా అంటూ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్​ఎస్​ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా శ్రేణుల దారుణంగా పోస్టులు పెడుతున్నారన్నారు.

Minister Konda Surekha Comments on BRS
Minister Konda Surekha Comments on BRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 9:30 PM IST

Updated : Sep 30, 2024, 9:49 PM IST

Minister Konda Surekha Fires on KTR : అధికారం కోల్పోయిన బాధలో బీఆర్​ఎస్​ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళా మంత్రిని అవమానిస్తూ సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ నేతల వైఖరి ఆటవిక సమాజాన్ని తలపిస్తోందని విమర్శించారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్​ సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటామన్నారు. మహిళను వ్యక్తిగతంగా అవమానించటం మాత్రం సరికాదని మంత్రి సురేఖ హెచ్చరించారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఒక మహిళా మంత్రిని అవమానిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని తెలిపారు. అదికారం కోల్పోయిన బాధలో బీఆర్​ఎస్​ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదని అన్నారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్​ సమర్థిస్తారా? డబ్బులు ఇచ్చి మహిళను దారుణంగా ట్రోల్​ చేయించటం సరికాదని హితవు పలికారు. మొదటి నుంచి కేటీఆర్​ మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్సుల్లో మహిళలు డిస్కో డ్యాన్స్​లు చేస్తున్నారన్నారు : మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే బస్సుల్లో డిస్కో డ్యాన్స్​ చేస్తున్నారని అవమానించారని మంత్రి సురేఖ మండిపడ్డారు. చేనేత కార్మికులకు కేటీఆర్​, బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటామని, మహిళను వ్యక్తిగతంగా అవమానించటం మాత్రం సరికాదని హితవు పలికారు.

మంత్రి సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా : సామాజిక మాధ్యమాల వేదికగా మంత్రి కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు మాజీమంత్రి, బీఆర్​ఎస్​ శాసనసభ్యుడు హరీశ్​ రావు తెలిపారు. ఎక్స్​ వేదికగా స్పందించిన ఆయన మహిళలను గౌరవించడం మనందరికి బాధ్యత అని, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఓ ఒక్కరూ సహించరని పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్​ఎస్​ పార్టీ అయినా, వ్యక్తిగతంగా తానైనా ఉపేక్షించబోమని హరీశ్​రావు స్పష్టం చేశారు. సోషల్​ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సోషల్​ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరుతున్నట్లు హరీశ్​రావు పేర్కొన్నారు.

"అధికారం కోల్పోయిన బాధలో బీఆర్​ఎస్​ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టారు. ఒక మహిళా మంత్రిని అవమానిస్తూ సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. బీఆర్​ఎస్​ నేతల వైఖరి అటవిక సమాజాన్ని తలపిస్తోంది. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్​ సమర్థిస్తారా? ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటాం. మహిళను వ్యక్తిగతంగా అవమానించటం మాత్రం సరికాదు." - కొండా సురేఖ, మంత్రి

కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కార్యాలయాన్నే కూల్చాలి : కేటీఆర్ - KTR Fires on Hydra

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్​ - అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టమని హెచ్చరిక - KTR Condemned Police Attack

Last Updated : Sep 30, 2024, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.