Minister Komatireddy Venkat Reddy Nalgonda Tour : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్‌తో కలిసి పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చింతపల్లి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. చింతపల్లి మండల కేంద్రంలో 2 కిలోమీటర్ల మేర హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిని టూ వే లైన్ నుంచి ఫోర్ వే లైన్‌గా విస్తరణ చేసే పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే దేవరకొండ పట్టణంలో గుట్ట పైన వెలసిన శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. గుట్టపైకి రహదారి మంజూరుతో పాటు ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు.
దేవరకొండతో పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలను నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాచలం(Bhadrachalam) రామయ్య పాదాల సాక్షిగా ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పేదవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి, మంత్రులందరూ 24 గంటలు కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి తండాకు, గ్రామానికి రోడ్లు వేయించే బాధ్యత తనదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా కిషన్‌రెడ్డికి లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komati Reddy Laid Foundation Stone for Development Works : ఈ ప్రాంత అడవి బిడ్డలకు ఎంత చేసినా తక్కువేనని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో మొత్తం రూ.40 కోట్ల వ్యయంతో రోడ్ల మంజూరు చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. దేవరకొండతో పాటు, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలను నిర్మిస్తామన్నారు. నల్గొండ నుంచి కొల్లాపూర్ వరకు వయా మల్లేపల్లి, దేవరకొండ, కల్వకుర్తి మీదుగా జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర రవాణా శాఖ మంత్రిని, ప్రధానమంత్రి(Prime Minister)ని కోరామన్నారు. త్వరలోనే ఈ రోడ్డును ప్రారంభిస్తామన్నారు.
"కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్, హరీశ్‌రావు ఒక్కనాడు కూడా ఇక్కడికి రాలేదు. ఈ పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు కానీ వైన్స్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణానికి తెర తీశారు. లక్ష కోట్లు తిన్న కేసీఆర్‌కు అధికారం పోయేసరికి సగం మైండ్ బ్లాక్ అయింది. ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తిగా మతి భ్రమిస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతాయి. కాంగ్రెస్‌కు 64కు మించి సీట్లు వస్తాయి. నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులు లేరు. నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి." - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రోడ్డు, భవనాల శాఖ మంత్రి
13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం - ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మొద్దు : మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ : డిప్యూటీ సీఎం భట్టి