Komati Reddy Shocking Comments on KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూ.26 వేల కోట్లు వడ్డీలకే చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జాతీయ బ్యాంకుల వద్ద 10 నుంచి 12 శాతం వడ్డీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని అన్నారు. ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట గత ప్రభుత్వం రూ.వేల కోట్లు కుంభకోణం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గత ప్రభుత్వ లోపాలను తెలిపారు.
Komati Reddy on Medigadda Project : ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ పోయిన సంవత్సరమే దశాబ్ది ఉత్సవాలు చేశారని, మళ్లీ శనివారం మెుదలుపెట్టారని పేర్కొన్నారు. అధికారం పోయిందని దుఃఖం వచ్చిందని రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారని విమర్శించారు. ఆ సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారని వ్యాఖ్యానించారు. దీంతో పాటు కేసీఆర్‌తో భోజనం చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని తెలిపారు.
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే : మంత్రి కోమటి రెడ్డి - Komatireddy Fires On KCR
Komati Reddy Speech about TG Formation Day : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబంధు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రూ.26 వేల కోట్లు వడ్డీలకు చెల్లించామని వివరించారు. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్పీ నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని ప్రకటించారు.
"జాతీయబ్యాంకుల వద్ద 10 నుంచి 12 శాతం వడ్డీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రూ.26 వేల కోట్లు వడ్డీలకు చెల్లించాం. అక్రమాలను బయటపెడతామనే కేసీఆర్ అసెంబ్లీకే రాలేదు. విద్యుత్ కొరత వల్ల ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోలేదు. లోక్‌సభ ఎన్నికల తరవాత(మంగళవారం) తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరు. కాంగ్రెస్‌కి 12 సీట్లు వస్తాయని భావిస్తున్నాను."-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి