ETV Bharat / politics

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 12:23 PM IST

Updated : Mar 7, 2024, 1:29 PM IST

Mahabubnagar BRS MLC Candidate 2024 : మహబూబ్​నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో, కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు 2028 జనవరి 4 వరకు గడువు ఉండటంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే ఆ స్థానానికి భారత్​ రాష్ట్ర సమితి తన అభ్యర్థిని ప్రకటించింది. నవీన్​ కుమార్​ను పార్టీ తరఫున బరిలోకి దింపనున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్​ స్పష్టం చేశారు.

Naveen Kumar
BRS MLC Candidate Naveen Kumar

Mahabubnagar BRS MLC Candidate 2024 : మహబూబ్​నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్​ఎస్​ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తరఫున పోటీకి నాగర్​కుంట నవీన్ కుమార్ రెడ్డిని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, నవీన్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. నందిగామ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి, గతంలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్​గా పని చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయన బీఆర్​ఎస్​ తరఫున ఎన్నికల బరిలో దిగనున్నారు.

Mahabubnagar Local Bodies BRS MLC Candidate Naveen Kumar : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆరోజు నుంచి మార్చి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల పరిశీలన, 14న నామినేషన్ల ఉప సంహరణ గడువుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్చి 28న పోలింగ్ జరగనుంది. ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు 2021 నవంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 2 స్థానాలకు నోటిఫికేషన్‌ పడింది. అప్పుడు కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్​ఎస్​అధికారంలో ఉండటం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావడంతో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో ఈ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాయి.

మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పూర్వ మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలిక కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 2021లో 1,445 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల పదవీ కాలం ముగియకపోవడం వల్ల ప్రస్తుతం వారే ఓటర్లుగా ఉండనున్నారు. అప్పట్లో 1039 మంది బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ నుంచి 241 మంది, బీజేపీ నుంచి 119 మంది, ఇతరులు 46 మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.

దమ్ముంటే కేసీఆర్ మహబూబ్​నగర్ స్థానం నుంచి పోటీ చేయాలి : వంశీచంద్‌రెడ్డి

శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా మంది పార్టీలు మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మరికొంత మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల బలాబలాలు గతంతో పోల్చితే మారిపోయాయి. కాంగ్రెస్- బీఆర్​ఎస్​ మధ్య గట్టి పోటీ ఉంది. బీజేపీ, ఇతరుల ఓట్లకు ప్రాధాన్యం దక్కనుంది. అభ్యర్థులు ఎవరైనా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఎవరు ఎక్కువ మంది మద్దతును కూడగట్టగలరో వారికే విజయావకాశాలు అధికంగా ఉంటాయి.

ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే 'ఎంపీ' గెలుపు గుర్రాలెవరు? - ఉమ్మడి పాలమూరులో ఇప్పుడిదే హాట్​టాపిక్

Last Updated : Mar 7, 2024, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.