ETV Bharat / politics

భూములను మింగేసే కొత్త వైరస్!- Bro ఈ Tro ఏమిటి? - Land virus in AP

land Virus in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు మరో ఉపద్రవం ముంచుకొచ్చిందా? కరోనా లాంటి మరో వైరస్ మన భూములకు మాయం చేయనుందా? వైరస్​ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ విపత్తు నుంచి కాపాడే ఆయుధం​ ఏంటి? వైరస్​ నిర్మూలనలో మన పాత్ర ఏమిటో తెలుసుకుందాం! సోషల్​ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది.

ap_land_titling_act
ap_land_titling_act (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 1:25 PM IST

Updated : May 8, 2024, 2:43 PM IST

land Virus in Andhra Pradesh : లాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త వైరస్​ ఆస్తులను కబళించనుంది. భూములను తన గుప్పిట పెట్టుకుని యజమానులను మానసికంగా కుంగతీసి చంపుతుంది. ఈ కొత్త వైరస్​ చట్టం వల్ల వచ్చే విపత్తులివే.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై వ్యతిరేకత - రిజిస్ట్రేషన్లకు భయపడుతున్న జనం - Land Titling Act Problems

జగన్​ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) కీలక వ్యక్తి. ఇప్పటిదాకా ఆస్తులు, భూములు ఉన్నోళ్లు భూస్వాములైతే నయా చట్టంలో TROనే భూస్వామి. ఇక మన స్థిరాస్తుల జాతకాలన్నీ ట్రో (TRO) పరిధిలోకి పోతాయి. మీరు స్థిరాస్తి కొనుక్కున్నా, అమ్ముకున్నా, ఈయనగారికి చెప్పి చేయాల్సిందే! మీ ఆస్తి పైన పూర్తిగా హక్కులు, తుది నిర్ణయం ట్రో గారిదే. ఇప్పటి దాకా ఎడతెగని సేవలు చేసిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థల పనులన్నీ ఇక ఈ ట్రో నే చక్క దిద్దుతాడట.

జగన్​ భూ దాహానికి ముసుగు ​చట్టం - ఆ లక్షల ఎకరాలు ఎవరి ఖాతాలోకి? - AP LAND TITLING ACT 2023

మీ ఇంటి ఆడపిల్లకు పసుపుకుంకుమ కింద ముచ్చట పడి ఏదైన ఆస్తి ఇద్దామన్నా, మీ అబ్బాయిని విదేశాలకు పంపాలన్నా కొంతపొలం అమ్ముకోవాలి కదా! అప్పుడు ట్రో గారి అనుమతి తప్పనిసరి. పోనీ కష్టపడి తాకట్టు పెట్టి కోర్టు నుంచి తనఖా డిక్రీ పొందినా ట్రో దగ్గర నమోదు చేయించాల్సిందే. ఆయన నిరభ్యంతర పత్రం (No objection certifcate) ఇస్తే తప్ప అడుగు ముందుకు పడదు. మాకు కోర్టులు ఉన్నాయి, న్యాయవాదులు పరిచయమే, చట్టాలు కూడా తెలుసు అని అనుకుంటే పొరపాటే. భూ వివాదాల్లో స్థానిక సివిల్ కోర్టులను ఆశ్రయించడం కుదరదు. ఒకవేళ హక్కుదారుడి పేరు ఫిర్యాదు రిజిస్టర్లో కనుక ఉంటే హైకోర్టుకే వెళ్లాలి. కోర్టు తీర్పు అనుకూలంగా లేదంటే వ్యతిరేకంగా వస్తే ఈ వ్యవహారాన్ని తిరిగి ట్రో దగ్గర నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే.

గుబులు పుట్టిస్తోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ - ఆస్తుల సంగతేంటి? - AP Land Titling Act 2023

దురదృష్టవశాత్తు ట్రో గనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెటు (clearance certifcate) ఇవ్వకపోతే మీరు వేసిన దావాకాని, అప్పీలు కానీ చెల్లకుండా కథ మళ్లీ మొదటికొస్తుంది. భూ యజమాని అనారోగ్యం దాపురించి, ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ రాయల్సి వస్తే సదరు విషయాన్ని కూడా ట్రో దగ్గర నమోదు చేయాలి. ఇంతకీ ఈ ట్రో న్యాయశాస్త్ర కోవిదుడా అంటే కానేకాదు. చార్టెడ్ అకౌంట్స్ చేసి రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ విషయాలపై అవగాహన ఉన్న వాడా అంటే లేనే లేదు. అయితే ట్రో గారిపై స్థానిక ఎంఎల్ఏ, ఎంపీ పెత్తనం ఉంటుందట. సదరు ఎమ్మెల్యే, ఎంపీ మాత్రం ఊరికే పనిచేసి పెడతారా? ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో! వాళ్ల అవసరాలు వారికి ఉంటాయి కదా?! అందుకే ఆదిలోనే ఈ చట్టాన్ని అంతం చేస్తే చాలదా? ఓటు ఆయుధంతో కొత్త వైరస్​ను నిర్మూలిస్తే తప్ప భూములకు పట్టిన పీడ వదలదు.

'ల్యాండ్ టైటిల్ చట్టం వల్ల పేదలు భూములు కోల్పోయే పరిస్థితి- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - AP Land Titling Act

Last Updated : May 8, 2024, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.