KTR Tweet on Farmer Loan Waiver : రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రైతు భరోసా లేక ఇంకొందరు రైతులు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే, కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరం
— KTR (@KTRBRS) September 12, 2024
కేసీఆర్ గారు రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుంది.
రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా… pic.twitter.com/wl1XpHtWFi
రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా కూడా బోగస్నే అని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాడు రైతు సురేందర్ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా, రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు రైతు సాగర్ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్ ఆందోళన చెందారు. తన పేరిట ఉన్న రూ.లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న రూ.1.60 లక్షల రుణంలో ఏ ఒక్కరికీ రుణమాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయారని తెలిపారు. ఇలా ఈ ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని ప్రశ్నించారు.
రుణమాఫీలో పావుశాతం కూడా కాలేదు : ఏకకాలంలో అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాట తప్పిన సీఎంను ఏం చేయాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. డిసెంబరులో పెట్టిన డెడ్‌లైన్ సెప్టెంబరు దాటినా అమలు కాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలన్నారు. రూ.49,500 కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్లు చల్లారుతాయని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి దిల్లీ యాత్రలు చేయటం కాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యంగా ఉండాలని కేటీఆర్ చెప్పారు.
గురుకులాల్లో పాము కాట్లు ఏంటి? : గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. ప్రభుత్వం ఈ సమస్యపై మొద్దు నిద్ర వీడాలంటే ఎంతమంది ఆసుపత్రుల పాలు కావాలని, ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నిలదీశారు. ఒకప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామా అయిన గురుకులాల్లో నేడు పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు నిత్యకృత్యం కావడం దురదృష్టకరమని హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు.
'వద్దురా నాయనా కాంగ్రెస్ సర్కార్ - రుణమాఫీ లేదు - రైతు భరోసా రాదు' - KTR TWEETS TODAY LATEST NEWS
మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చుపెట్టారు : హరీశ్‌రావు - Harish Rao sensational comments