KTR Tweet On Revanth Reddy Investments Tour : పెట్టుబడులు ఆకర్షించమే ప్రధాన లక్ష్యంగా విదేశాలకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎక్స్ వేదికగా సీఎం బృందానికి శుభాకాంక్షులు చెప్పిన కేటీఆర్ గత ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు విశేష కృషి చేసిందన్నారు.
టీఎస్ ఐపాస్ వంటి కార్యక్రమాల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలసీలు తెచ్చామని గుర్తు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.4లక్షల కోట్ల పెట్టుబడలు తీసుకురావటం ద్వారా ప్రైవేటు రంగంలో సుమారు రూ.24లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం సైతం తమ స్ఫూర్తిని కొనసాగిస్తుందని ఆకాంక్షిస్తున్నామన్న ఆయన తనకు, బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
As a large contingent from the Telangana Government travels to the US and South Korea to attract investments, I want to take a moment to wish @revanth_anumula and @Min_Sridhar_Babu gaaru - “All the Best”
— KTR (@KTRBRS) August 4, 2024
I came across the schedule reported by some media outlets and I'm pleased…
అమెరికా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి - ఘనస్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు - Revanth Reddy America Tour
రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడమే ధ్యేయంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అమెరికాకు చేరుకుంది. న్యూయార్క్‌లో రేవంత్ రెడ్డి బృందానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. న్యూయార్క్‌లో ఇవాళ ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు సమాచారం. 11 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించనున్నారు.
8 రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో ఈ బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఈ నెల 14 వరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. నేడు మంత్రి శ్రీధర్‌బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరితో పాటుగా సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు అమెరికా వెళ్లనున్నారు.
ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం : ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. ఈ నెల 7న ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటాయి. 8వ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈవో, ఆరమ్, ఆమ్‌జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్ట్ టెక్ యూనికార్న్స్ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ ఉంటుంది.