ETV Bharat / politics

'ఇందిరమ్మ రాజ్యం అంటూ - ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారు' - KTR on BRS Leaders House Arrest - KTR ON BRS LEADERS HOUSE ARREST

KTR Fires on BRS Leaders House Arrest : ప్రజా పాలనలో ప్రతిపక్షాలు మీటింగ్​ పెట్టుకోవడానికీ అనుమతి లేదా అంటూ కేటీఆర్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ నేతల అరెస్టులు నాటి ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ సమావేశం అంటే సీఎంకు ఎందుకంత భయమని ప్రశ్నించారు.

KTR Fires on BRS Leaders House Arrest
KTR Fires on BRS Leaders House Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 12:29 PM IST

KTR on BRS Leaders House Arrest : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్​లు, గృహ నిర్బంధాలు చేయటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి, ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హౌస్​ అరెస్టులు చేస్తారా అంటూ కేటీఆర్​ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్​ పెట్టుకోవటానికి కూడా అనుమతి లేదా అంటూ మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్​ విమర్శించారు. బీఆర్​ఎస్​ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ నేతలను గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్​ తీరును ప్రశ్నిస్తే దాడులు : దాడి చేసిన వారిని వదిలేసి, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని కేటీఆర్​ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులూం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రశ్నిస్తే చాలు ప్రజాప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు : తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారన్నారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును పోగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ సహించదని హెచ్చరించారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతల్ని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

'రాజకీయ కుట్రలు సహించేది లేదు - శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించండి' - CM Revanth Orders to DGP

'సీఎం రేవంత్‌ రెడ్డి ప్రోద్బలంతోనే - ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై దాడి జరిగింది' - Harish Rao about Koushik Reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.