ETV Bharat / politics

అధికారుల వెంబడి కాదు మంత్రుల వెంట పడదాం - ఎవరికి ఓటేశామో వాళ్లనే అడుగుదాం : కేటీఆర్‌ - KTR ON LOAN WAIVER ISSUES

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 1:43 PM IST

Updated : Aug 22, 2024, 3:45 PM IST

KTR Comments On CM Revanth Reddy : రైతులు అధికారుల వెంబడి కాకుండా కాంగ్రెస్ నేతల వెంట పడాలని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. ఓట్లు ఎవరికి వేశామో వాళ్లనే రుణమాఫీ అడుగుదామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిపై కేటీఆర్ పలు విమర్శలు గుప్పించారు. షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరిగేదాక కాంగ్రెస్‌ను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

KTR Comments On CM Revanth Reddy
KTR Comments On CM Revanth Reddy (ETV Bharat)

KTR Comments On CM Revanth Reddy : రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కాంగ్రెస్​, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షరతులు లేకుండా రూ.2లక్షల వరకు రుణమాఫీ జరిగేదాక ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు. ఓట్లు ఎవరికి వేశామో వారినే రుణమాఫీ గురించి అడుగుదామని, రైతులు అధికారుల వెంబడి కాకుండా కాంగ్రెస్​ నేతల వెంటపడాలని సూచించారు.

ఎక్కడికక్కడ దేవుళ్లపై ఒట్లు వేసి చెప్పారు : లోక్‌సభ ఎన్నికల సభల్లో ప్రచారానికి ఎక్కడికెళ్తే అక్కడున్న దేవుళ్లపై రేవంత్​ రెడ్డి ఒట్లు వేశారని కేటీఆర్ మండిపడ్డారు. 'పంద్రాగస్టున రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లేసి సీఎం చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వేములవాడ రాజరాజేశ్వరస్వామిపై, మహబూబ్‌నగర్‌ కురుమూర్తి, భద్రాద్రి సీతారాములస్వామిపై ఒట్లు వేశారు' అని కేటీఆర్​ విమర్శించారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు కావాలని సీఎం రేవంత్ చెప్పారన్న కేటీఆర్ మంత్రివర్గం భేటీలో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కావాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు.

"డిసెంబర్‌ 9న తొలి సంతకం రుణమాఫీపై అని సీఎం హామీ ఇచ్చారు. రుణాలు తెచ్చుకోని వాళ్లు వెంటనే తెచ్చుకోవాలని చెప్పారు. రేవంత్‌ రెడ్డి సీఎం కాగానే రుణమాఫీ కోసం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతు రుణమాఫీకి ఎంత అవుతుందని బ్యాంకర్లను అడిగారు. రూ.2 లక్షల చొప్పున రుణమాఫీకి రూ.49 వేల కోట్లు అవుతాయని బ్యాంకర్లు చెప్పారు " - కేటీఆర్​, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR On CM Revanth Reddy : 'కేసీఆర్​కు అధికారం పోయాక చేవెళ్లకు కలపోయిందని, బతుకులు ఆగమాగం అయ్యాయని ప్రజలంటున్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి నష్టపోయామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. రుణమాఫీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటపడాలని చావు తెలివితేటలు మొదలు పెట్టారు. మనుషులనే కాదు, దేవుళ్లను కూడా ఆయన మోసం చేశారు. ఇప్పుడు దేవుళ్లు ఆయన కోసం వెతుకుతున్నారు' అని కేటీఆర్ విమర్శించారు.

సబితా ఇంద్రారెడ్డిని అవమానించారు : అసెంబ్లీలో ప్రశ్నిస్తే చెప్పడం చేతగాక సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ రెడ్డి పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. నాలుగున్నర గంటలు నిలబడినా ఒక్క నిమిషం మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని సబితా ఇంద్రారెడ్డిని నిండు అసెంబ్లీలో అవమానించారని మండిపడ్డారు.

'రేవంత్ రెడ్డి సొంత ఊరు, నియోజకవర్గానికి పోయి వందశాతం రుణమాఫీ అయిందో లేదో రైతులను అడుగుదామని సవాల్ చేశాను. రుణమాఫీ దగుల్బాజీ అని రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టే నా సవాల్​కు ఆయన సప్పుడు చేయలేదు. రూ.49వేలకోట్ల నుంచి ప్రారంభించి రూ.7500 కోట్లకు వచ్చారు. అందరికీ రుణమాఫీ చేస్తామని మళ్లీ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు' అని కేటీఆర్ విమర్శించారు.

రైతన్నల వెంటే బీఆర్ఎస్ : ఇది మొదటి అడుగు మాత్రమేనన్న కేటీఆర్, ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ పూర్తయ్యే వరకు ప్రభుత్వం వెంట పడతామని తెలిపారు. రైతన్నల తరపున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉందని, ఎవర్నీ వదిలి పెట్టబోమని పేర్కొన్నారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల వెంట పడతామని చెప్పారు. హామీలు అమలు చేయకపోతే గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నారో అవన్నీ ఆయనకు జరుగుతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కొర్రీలొద్దు, కోతలొద్దు - అర్హులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేయాల్సిందే : బీఆర్ఎస్ - BRS Dharna For Complete Loan Waiver

రుణమాఫీ పేరుతో రైతులను నట్టేట ముంచారు - ఖర్గే, రాహుల్​కు కేటీఆర్‌ లేఖ - KTR Letter To Rahul Gandhi

Last Updated : Aug 22, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.