ETV Bharat / politics

రాష్ట్రానికి లబ్ధి కలిగించే విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం: కేటీఆర్ - KTR SPEECH IN ASSEMBLY TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 10:39 AM IST

Updated : Aug 2, 2024, 12:19 PM IST

KTR on Central New Laws : ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని అలాంటివి మంచిదికాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి లబ్ధి కలిగించే విషయాల్లో అందరూ కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు.

KTR DEMANDS STATE GOVT ON NEW LAWS
KTR on Central New Laws (ETV Bharat)

KTR on Central New Laws : కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్రప్రభుత్వం తన వైఖరి చెప్పాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్ చేశారు. ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని, అవి మంచివి కావని ఆయన పేర్కొన్నారు. ఇవాళ్టీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్​ కోర్టు సవరణ బిల్లుపై కేటీఆర్​ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యాచారాలు, సైబర్‌క్రైమ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలని, బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలని తెలిపారు.

సోషల్​ మీడియాలో దుష్ప్రచారం : రాష్ట్రంలో సైబర్‌క్రైమ్‌ బాధితులకు సత్వర న్యాయం అందాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సైబర్‌క్రైమ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలని కోరారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిదికాదని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం జరుగుతోందని, ప్రధానులు, సీఎంల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పొన్నం రియాక్షన్​ : అనంతరం రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా మంత్రిపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని, సభా కార్యక్రమాలపై ఫేక్‌ వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలిపాలి. కేంద్రం తెచ్చిన నూతన క్రిమినల్​ చట్టాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం నేరంగా పరిగణిస్తున్నారు. వాటిని పూర్తిగా అమలు చేస్తారా? లేదా కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్​ రాష్ట్రాల మాదిరిగా సవరణలకు అంగీకరిస్తారా చెప్పాలి. మరోవైపు రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం జరుగుతోంది. ప్రధానులు, సీఎంల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయి. - కేటీఆర్, మాజీమంత్రి

48 గంటల్లో నాలుగు అత్యాచార ఘటనలా? - నిజంగా సిగ్గుచేటు : కేటీఆర్​ - ktr tweet on women safety in tg

కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినా రాజీనామా చేస్తా - ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ - KTR SLAMS CONGRESS GOVT OVER JOBS

Last Updated : Aug 2, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.