ETV Bharat / politics

కవితకు బెయిల్​ రావడంపై కేటీఆర్​, బండి మధ్య ట్వీట్ వార్ - 'కేంద్రమంత్రి​ ఆ వ్యాఖ్యలు చేయడం తగదు' - kavitha bail KTR and Bandi tweets

Supreme Court Gets Bail to BRS MLC Kavitha : దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్​ రావడంపై కేటీఆర్​, కేంద్రమంత్రి బండి సంజయ్​ ట్వీట్స్​ చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అని కేటీఆర్​ పేర్కొనగా, కవితకు బెయిల్​ రావడం అనేది బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండింటికీ విజయమని బండి సంజయ్​ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై కేటీఆర్​ మండిపడ్డారు.

ktr and bandi sanjay tweets
ktr and bandi sanjay tweets (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 3:08 PM IST

BRS MLC Kavitha Bail KTR and Bandi Tweets : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్​ మంజూరు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆమె తిహాడ్​ జైలు నుంచి బయటకు రానుండడంతో ఎక్స్​ వేదికగా కేటీఆర్​, కేంద్రమంత్రి బండి సంజయ్​ ట్వీట్స్ చేశారు. కానీ బండి సంజయ్​ చేసిన ట్వీట్​పై కేటీఆర్​ ఫైర్​ అయ్యారు. ఇవాళ ఆమె బెయిల్​ పిటిషన్​పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంతో కూడిన జస్టిస్​ బీఆర్​ గవాయి, జస్టిస్​ విశ్వనాథన్​ బెయిల్​ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు : కవిత బెయిల్​ రావడంతో బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. చివరి న్యాయం గెలిచిందని ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉపశమనం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

కవితకు బెయిల్​ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ విజయం : మరోవైపు కవితకు బెయిల్​ రావడం అనేది బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండింటికీ విజయమని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ లీడర్​ బెయిల్​పై బయటకు కాంగ్రెస్​ నేతకు రాజ్యసభ సీటు అని తెలిపారు. బెయిల్​ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్​ రాజకీయ చతురత అని బండి సంజయ్​ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ఈ విధంగా స్పందించారు.

బండి సంజయ్​ వ్యాఖ్యలపై కేటీఆర్​ ఫైర్ : ఎమ్మెల్సీ కవిత బెయిల్​ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్​ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. సంజయ్​ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సీజేఐ సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఆయన మాటలను కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్​ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు బెయిల్​ ఊహించిందేనని బీజేపీ, బీఆర్​ఎస్​ కుమ్మక్కుతోనే బెయిల్​ వచ్చిందని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్​ను దెబ్బతీయాలని చూశారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కుమ్మక్కై బీఆర్​ఎస్​ బీజేపీకీ దాసోహం అయిందని విమర్శించారు. హరీశ్​రావు, కేటీఆర్​ దిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగి ఆపద మొక్కులు మొక్కారన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్లమీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంక బీజేపీలో బీఆర్​ఎస్​ విలీనం ఒక్కటే మిగిలిందని మహేశ్​ కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట - దిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు - BRS MLC KAVITHA GRANTED BAIL

సిసోడియాకు బెయిల్ వచ్చింది కదా, త్వరలోనే కవితకు కూడా బెయిల్ వస్తుంది! : కేటీఆర్ - BRS Leader KTR On Kavitha Bail

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.