ETV Bharat / politics

బీజేపీ హయాంలో పాకిస్థాన్ తోక కత్తిరించాం - దేశంలో శాంతి కావాలంటే మోదీ రావాలి : కిషన్‌రెడ్డి - Kishan Reddy Election Campaign - KISHAN REDDY ELECTION CAMPAIGN

Kishan Reddy Speech at Musheerabad BJP Meeting : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన కోసం, తన కుటుంబం కోసం ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. కానీ నరేంద్ర మోదీకి మాత్రం ప్రజలకు సేవ చేయాలని, దేశం కోసం ప్రధాని కావాలనే ఆకాంక్షతో ఉన్నారని తెలిపారు.

BJP Meeting in Hyderabad
Kishan Reddy Speech at Musheerabad (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 1:53 PM IST

బీజేపీ హయాంలో పాకిస్థాన్ తోక కత్తిరించాం - దేశంలో శాంతి కావాలంటే మోదీ రావాలి : కిషన్‌రెడ్డి (ETV BHARAT)

Kishan Reddy Speech at Musheerabad BJP Meeting : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి కోరారు. ఓటేసిన తర్వాత ఫొటో తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రవాదులు వచ్చి దేశ ప్రజలను చంపేవారని, ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని అన్నారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Kishan Reddy Comments : దేశంలో మత కలహాలు కావాలా? శాంతి కావాలా? అని కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో జమ్ముకశ్మీర్‌లోనే 42 వేల మంది పౌరులను ఉగ్రవాదులు చంపారని తెలిపారు. హస్తం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్థాన్‌ ఏమనుకుంటే అది భారత్‌లో జరిగేదని ఆరోపించారు. మోదీ హయాంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టామని పేర్కొన్నారు. తమ పార్టీ పాలనలో పాకిస్థాన్‌ తోక కత్తిరించామని చెప్పారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్​ కోసం మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్ ఎంపీగా మా ఆయననే గెలిపించండి - కిషన్ రెడ్డి సతీమణి ప్రచారం - Kishan Reddy Wife Campaign

Uttarakhand CM Election Campaign in Telangana : దేశంలో మళ్లీ మోదీ సర్కార్ రావాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి అన్నారు. కారు షెడ్డుకు వెళ్లిందని, ఇక అది రిపేర్ అయ్యే స్థితిలో లేదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ప్రతి వ్యక్తికి ఉత్తరాఖండ్​లో యూసీసీ యాక్ట్ తీసుకొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు.

"కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా..? మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇస్తున్నారా..? మీరంతా ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలు. నేను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోదీ చెబుతున్నారు. అంతకన్నా గ్యారంటీ ఇంకేం కావాలి. నేనొక్కడిని ఓటింగ్​కు పోకపోతే ఏమవుతుందనే అలసత్వం మాత్రం వద్దు. కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయండి." - పుష్కర్ సింగ్ దామి, ఉత్తరాఖండ్ సీఎం

MP Laxman Comments : మోదీకి సరితూగే వ్యక్తి విపక్ష కూటమిలో బూతద్దం పెట్టి వెతికినా కన్పించరని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఆర్థికంగా 11వ దేశంగా ఉన్న భారత్​ను 5వ స్థానానికి మోదీ తీసుకువచ్చారని తెలిపారు. స్కిల్ డెవలప్​మెంట్​, స్టార్టప్ ఇండియా కింద ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. పది సంవత్సరాల్లో ఒక్క రిజర్వేషన్ ఎత్తివేయలేదని, రద్దు అనే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ప్రజలు బీజేపీని మరోసారి ఆశీర్వదించబోతున్నారు - రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే : కిషన్‌ రెడ్డి - Kishan Reddy Meet the Press

యూపీఏ, ఎన్డీయే ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా - సీఎం రేవంత్​ రెడ్డికి కిషన్​రెడ్డి సవాల్ - Kishan Reddy Letter To Cm Revanth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.