KCR Kadanaberi Public Meeting in karimnagar : కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ కదనభేరీ(BRS Kadanabheri) సభలో పాల్గొన్న కేసీఆర్, 2001 మేలో ఇక్కడి నుంచే సింహగర్జన సభతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్లు వివరించారు. ఆశకు పోయి కాంగ్రెస్‌ను గెలిపిస్తే గ్యారంటీల అమలు వదిలి దిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని విమర్శించారు.
అహోరాత్రులు కష్టపడి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు(Rythu Bandhu Scheme), కరెంట్, నీళ్లు ఇవ్వకపోయినా మద్దతిచ్చినట్లువుతుందని హెచ్చరించారు. కొందరు పార్టీ మారగానే బీఆర్ఎస్ పనైపోయిందనే ప్రచారం చేస్తున్నారన్న గులాబీ దళపతి, భూమి ఆకాశాలు ఉన్నంతకాలం పార్టీ ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ సర్కారు కరెంట్, రైతుబంధు ఇవ్వలేకపోతోందని కేసీఆర్ విమర్శించారు.
గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్‌కు అధికారం ఇచ్చారు - మేం చెప్పినట్లే జరుగుతోంది : కేటీఆర్
"కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ వంద కాంపోనెంట్లలో అదొక చిన్న పిల్లర్. దానికింద ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగాయి. ఎంతసేపు కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు కానీ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించటంలేదు. ఇంకా వాటిపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తప్ప రైతుల వ్యథను పట్టించుకోవటం లేదు."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
KCR Fires on Congress Govt : తాను అధికారం దిగిపోగానే రాష్ట్రంలో కరెంట్, రైతు బంధు బంద్ అయ్యాయన్నారు. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నా పాలకులకు దయరావట్లేదని, మూడు నెలల్లో హస్తం పార్టీ రాష్ట్రాన్ని ఆగం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలన(Congress Rule) చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోందని అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన కేసీఆర్, సోషల్ మీడియాలో(Social Media) పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దని, మేం అలా చేస్తే కాంగ్రెసోళ్లు మిగిలేవారా అని ప్రశ్నించారు. ఒక పన్ను వదులైతే మొత్తం రాలగొట్టుకుంటామా అని అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో టీవీలోకి వచ్చి, కాళేశ్వరంపై వివరిస్తానని గులాబీ బాస్ తెలిపారు.
KCR Focus on Parliament Elections : సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారంటీలు అడిగితే, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబు అవుతా అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తానూ పరుషంగా మాట్లాడాననీ కానీ, సీఎం అయిన తర్వాత అలా మాట్లాడలేదని తెలిపారు. తమాషాకు ఓటేయొద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో వినోద్‌ను గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'సమాజం కోసం సేవ చేసేందుకు మమ్మల్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయండి'
ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయండి - ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ