ETV Bharat / politics

కాంగ్రెస్​ బోగస్‌ మాటలతో ఆరు హామీలకు పంగనామం పెట్టింది : కేసీఆర్‌ - KCR BUS Yatra In Telangana

KCR Speech at Miryalaguda Road Show : బోగస్‌ మాటలతో ఆరు హామీలకు పంగనామం పెట్టి, ప్రజలను నిలువునా కాంగ్రెస్​ పార్టీ మోసం చేసిందని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్​ షోలో ఆయన పాల్గొని, అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. తనను తిట్టి పబ్బం గడుపుకోవడమే రాష్ట్ర మంత్రుల పని అని ధ్వజమెత్తారు.

BRS Election Campaign 2024
Telangana Lok Sabha Elections 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 7:42 PM IST

Updated : Apr 24, 2024, 8:39 PM IST

KCR Bus Yatra Start in Miryalaguda : ఆరు గ్యారంటీలకు పంగానామం పెట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌, లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు వస్తోందని బీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​ విమర్శించారు. తనను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం, తనని జైల్లో వేస్తామంటున్నారని దేనికి భయపడేది లేదన్నారు. గులాబీ ఎంపీల్ని గెలిపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో కేసీఆర్‌ బస్సుయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ జల ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించారని మండిపడ్డారు. సాగర్‌ ఆయకట్టు కింద పంటలను ఎండబెట్టారని ఆక్షేపించారు. రైతుబంధులో దగా చేశారని, రైతుబీమా ఉంటుందో, ఊడుతుందో తెలియదన్నారు. మిషన్‌ భగీరథను కూడా నడపలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్ని అమలు కావాలంటే, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

"ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులు గెలిస్తేనే, బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలుచేపిస్తాం. గులాబీ పార్టీకి బలం ఇస్తే, అది తెలంగాణ ప్రజల బలమవుతుంది. ఇవాళ 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలిస్తే భూమి, ఆకాశాన్ని ఏకం చేసే పోరాటం మేము చేస్తాం."-కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

BRS Chief KCR Fires on Congress Party : రాష్ట్రంలో ఏమి జరుగుతోందని ప్రశ్నించిన కేసీఆర్​, 4, 5 నెలలు కిందట ధీమాగా ఉన్న రైతులు, ఇవాళ విలవిల బోతున్నారని ఆక్షేపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీళ్లు కోసమే పోరాటం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలోనే ఇరిగేషన్ మంత్రి ఉన్న ఉపయోగం లేదని విమర్శించారు. 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్ పార్టీనేనన్న కేసీఆర్​, ఇప్పుడు సైతం అడ్డగోలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.

బీఆర్​ఎస్​ను గెలిపిస్తే - తెలంగాణ ప్రజల బలం అవుతుంది : రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటున్నారని, చెప్పులు తమకే కాదు రైతులకు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో రైతులకు ఇబ్బందులు లేవని, తెలంగాణ వచ్చాక కరవు అనేది అంతమైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు బలమిస్తే, సమస్యలపైన పోరాటం చేస్తామన్న కేసీఆర్​, 13న జరిగే ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్​ బోగస్‌ మాటలతో ఆరు హామీలకు పంగనామం పెట్టింది : కేసీఆర్‌

నాలుగున్నర నెలల కాంగ్రెస్​ పాలన మొత్తం తిట్లు - దేవుడి మీద ఒట్లతోనే సరిపోయింది : హరీశ్​రావు - Lok Sabha Elections 2024

బస్సు యాత్ర షురూ - 17 రోజుల్లో 12 నియోజకవర్గాలను చుట్టేయనున్న బీఆర్​ఎస్​ అధినేత - KCR BUS YATRA IN TELANGANA

Last Updated : Apr 24, 2024, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.