ETV Bharat / politics

రసవత్తరంగా కరీంనగర్‌ రాజకీయం - ఒక్కొక్కరుగా బీఆర్ఎస్​ను వీడుతున్న నేతలు - KARIMNAGAR BRS PARTY POLITICS - KARIMNAGAR BRS PARTY POLITICS

Karimnagar Politics 2024 : ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌లో రాజకీయాలు వైవిధ్యంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నా బీఆర్ఎస్​కు సరైన సహకారం లభించడం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు పెద్దఎత్తున నిధులు సమకూర్చిన నేతగా పేరొందిన వినోద్‌కుమార్‌ ఇప్పుడు పార్టీ నుంచి వలసలు పెరగడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Karimnagar Politics 2024
Karimnagar BRS Leaders Joining In Congress (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 8:07 AM IST

రసవత్తరంగా కరీంనగర్‌ రాజకీయం - ఒక్కొక్కరుగా బీఆర్ఎస్​ను వీడుతున్న నేతలు (ETV BARATH)

Karimnagar BRS Leaders Joining In Congress : లోక్‌సభ ఎన్నికల వేళ కరీంనగర్‌ బీఆర్ఎస్​లో ముసలం ఏర్పడింది. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటంతో జిల్లాలో పార్టీకి పెద్దిదిక్కుగా భావించే వినోద్‌కుమార్‌ అసహనానికి గురవుతున్నారు. ఒకప్పుడు జిల్లా నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడినప్పుడు వాటిని చక్కదిద్దే బాధ్యతను వినోద్ కుమార్ భుజాన వేసుకునేవారు. సెగ్మెంట్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నేతలకు పెద్దన్నలా ఉండే ఆయన నేడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

బీఆర్ఎస్ నాయకుల మధ్య అగాధం ఏర్పడి వర్గాలుగా విడిపోయిన వారంతా వినోద్ కుమార్​తో మాత్రం సాన్నిహిత్యంగా మెదిలేవారు. 2018 ఎన్నికల తరువాత క్యాబినెట్ కూర్పు విషయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ను మెప్పించి ఓప్పించే బాధ్యత కూడా ఆయనపైనే పడింది. వేములవాడలో అభ్యర్థి మార్పు విషయంతో పాటు సిరిసిల్లకు సంబంధించిన వ్యవహారాలపై కూడా ఆయన చొరవ చూపించాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీకి అనుకూల వాతావరణం లేకుండాపోయింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది : వినోద్‌ కుమార్‌ - BRS MP Candidate Vinod Comments

Political Heat In Karimnagar Politics : స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీశ్రేణులు ఒక్కొక్కరుగా హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో ఎంపీగా ఓడిపోయినా అధినేత కేసీఆర్ ఆయనపై విశ్వాసంతో కరీంనగర్‌లో మరో అభ్యర్థి ఆలోచనే చేయలేదు. సిరిసిల్లలో బీఆర్ఎస్​కు చెందిన పలువురు కార్పోరేటర్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోవడంతో వలసలు ప్రారంభమయ్యాయనే ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలవేళ వేళ కరీంనగర్‌కి చెందిన కార్పోరేటర్లతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇంకా వలసల పరంపర కొనసాగే అవకాశాలే ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి శ్రేణులంతా కలిసి పనిచేస్తారన్న ఆశతో ఇంతకాలం వారిని అక్కున చేర్చుకున్న వినోద్ కుమార్‌ నేతలు దూరం అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని మీడియా సమావేశంలో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పదేళ్లుగా కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీని కీలక ఎన్నికల సమయంలో వదిలి ఇతర పార్టీలోకి వెళ్లడం తమను కుంగదీసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకప్పుడు జిల్లాలో పార్టీ శ్రేణులకు పెద్దదిక్కుగా వ్యవహరించిన వ్యక్తిని నేతలంతా ఒంటిరిని చేస్తున్న తీరు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

"కొంత మంది బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు. కీలకమైన ఎంపీ ఎన్నికల సందర్భంలో నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లడం నన్ను కుంగదీసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను అన్నీ విధాలుగా ఆదుకున్న కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరడం మంచిది కాదు." - కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్

కాంగ్రెస్​లోకి కొనసాగుతున్న వలసలు - సీఎం సమక్షంలో చేరిన నల్గొండ డీసీసీబీ వైస్ ఛైర్మన్ - Congress Joinings in Telangana

అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా, మధ్యలో వచ్చినా బీఆర్​ఎస్​దే గెలుపు : కేసీఆర్ - BRS Public Meeting at Huzurabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.