ETV Bharat / politics

చిరంజీవి ఇంటికెళ్లిన పవన్‌ కల్యాణ్ - గ్రాండ్​గా వెల్​కమ్​ చెప్పిన మెగా ఫ్యామిలీ - Pawan Kalyan Meets Chiranjeevi - PAWAN KALYAN MEETS CHIRANJEEVI

Pawan Kalyan Went to Chiranjeevi's House : జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ మెగాస్టార్​ చిరంజీవి నివాసానికి వెళ్లారు. దిల్లీ నుంచి హైదరాబాద్​ చేరుకున్న ఆయన నేరుగా చిరు ఇంటికి వెళ్లగా, తల్లి అంజనా దేవి ఆయనకు గుమ్మడికాయతో దిష్టి తీశారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 6:05 PM IST

Updated : Jun 6, 2024, 6:38 PM IST

చిరంజీవి ఇంటికెళ్లిన పవన్‌ కల్యాణ్ - గ్రాండ్​గా వెల్​కమ్​ చెప్పిన మెగా ఫ్యామిలీ (ETV Bharat)

Pawan Kalyan Meets Chiranjeevi in Hyderabad : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అగ్ర కథానాయకుడు, తన సోదరుడైన చిరంజీవిని కలిశారు. దిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్​ వచ్చిన పవన్, భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలతో కలిసి నేరుగా చిరు నివాసానికి వెళ్లారు. తల్లి అంజనా దేవి వారికి గుమ్మడి కాయతో దిష్టి తీయగా, పవన్​ వదినలు నీరాజనాలు ఇస్తూ లోపలికి ఆహ్వానించారు. మరోవైపు ఈ విజయోత్సవంలో భాగం అయ్యేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ చిరు ఇంటికి చేరుకున్నారు.

అన్నయ్య చిరంజీవి రాగానే నేరుగా ఆయన కాళ్లకు నమస్కారం చేయగా, పవన్​ను పైకి లేపి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆపై చిరు పైకి ఎగిరి మరీ పవన్​కు భారీ పూలదండను వేయగా మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా 'కల్యాణ్‌ బాబు హ్యాట్సాఫ్‌' అని రాసి ఉన్న కేక్‌ను కట్‌ చేసి పవన్‌ తన కుటుంబసభ్యులకు తినిపించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని పవన్​ నేడు హైదరాబాద్‌ చేరుకున్నారు. నేరుగా మెగాస్టార్​ ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.

నా హృదయం ఉప్పొంగుతోంది : పవన్‌ విజయంపై చిరు హర్షం - AP Elections 2024

నా హృదయం ఉప్పొంగుతోంది : ఏపీ ఎన్నికల్లో పవన్‌ విజయం సాధించడంపై సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు. పవన్​తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. "డియర్ కల్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా, అది ప్రజలను గెలిపించడానికే అని నిరూపించావ్. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల సంక్షేమం కోసం, నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు" అని పోస్టు పెట్టారు.

నాన్నకు ప్రేమతో - పవన్ కల్యాణ్ జర్నీపై అకీరా వీడియో - AKIRA NANDAN SPECIAL VIDEO FOR PAWAN KALYAN

Last Updated : Jun 6, 2024, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.