Harish Rao Fires On Cm Revanth Reddy : మెదక్‌లోని బీఆర్ఎస్ ర్యాలీలో పాల్గొన్న మాజీమంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలన్న హరీశ్ హామీల అమలుపై రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని సవాల్ చేశారు.
Harish Rao Comments On Cm Revanth : పంద్రాగస్టులోపు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మళ్లీ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని తెలిపారు. ఒకవేళ హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు. మంజీరాపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెక్‌డ్యామ్‌లు కట్టినందునే పంటలు ఎండిపోలేదని ప్రజలకు వివరించారు. మెదక్ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రంతో మాట్లాడి మెదక్‌కు రైలు తీసుకువచ్చామని చెప్పారు.
హామీల అమలుపై సీఎం అమరవీరుల స్తూపం వద్దకు రావాలి. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. గతంలో వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారు. గతంలో బాండ్ పేపర్‌కు విలువుండేది. రేవంత్ మోసంతో దాని విలువ పోయింది. బాండ్ పేపర్లను నమ్మట్లేదని ఎక్కడికెళితే అక్కడి దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారు. రేవంత్ దేవుడిపై ఒట్టు పెట్టినా, నూపై మీరుఒట్టు పెట్టుకున్నా ప్రజలు నమ్మరు. - హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Harish Rao Election Campaign in Medak : కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారని రేవంత్ మోసంతో దాని విలువ పోయిందని విమర్శించారు. బాండ్లను ఎవరూ నమ్మట్లేదని సీఎం ఇప్పుడు దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టు పెట్టినా, తనపై తాను ఒట్టు పెట్టుకున్నా ప్రజలు నమ్మరని తెలిపారు. బీజేపీ మాట నమ్మడం అంటే నీళ్లు లేని బావిలో దూకినట్లేనని, తెలంగాణలో ఒక్క వర్గానికి కూడా ఆ పార్టీ మేలు చేయలేదని అన్నారు. ఏం చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని, మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
జైలుకు వెళ్లేందుకు నేను ఎన్నడూ భయపడలేదు : కేసీఆర్ - KCR BUS Yatra In Telangana