ETV Bharat / politics

రాహుల్ సభ తుస్సుమంది - 30 వేల కుర్చీలేస్తే 3వేల మంది కూడా రాలేదు : హరీశ్‌ రావు - HARISH RAO ON RAHUL GANDHI MEETING - HARISH RAO ON RAHUL GANDHI MEETING

Harish Rao on Rahul Gandhi Meeting : కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు ఓటు వేస్తే ఉత్తదే అయిపోతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కరీంనగర్‌లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని అన్నారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌, బీజేపీపై విమర్శలు చేశారు.

BRS Leader Harish Rao Election Campaign in Karimnagar
BRS Candidates Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 3:00 PM IST

రాహుల్ సభ తుస్సుమంది - 30 వేల కుర్చీలేస్తే 3వేల మంది కూడా రాలేదు : హరీశ్‌ రావు

BRS Leader Harish Rao Election Campaign in Karimnagar : కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ బొమ్మలు పంచి ఓట్లు అడుగుతున్నారని, ఆయనకు ఓటు వేస్తే ఉత్తదే అయిపోతుందని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో కరీంనగర్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో హరీశ్‌ రావు పాల్గొని మాట్లాడారు.

కేసీఆర్‌కు హుస్నాబాద్‌ అంటే చాలా ఇష్టమని, ఆయన ఈ ప్రాంతాన్ని సెంటిమెంట్‌గా భావిస్తారని తెలిపారు. కరీంనగర్‌లో వికాసం కావాలంటే వినోద్‌ కుమార్‌ను గెలిపించాలని, విద్వేషం కావాలంటే కాంగ్రెస్‌, బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. బీజేపీ బడా కార్పొరేట్‌ సంస్థల గురించి ఆలోచించే పార్టీ అని, కార్పొరేట్‌ సంస్థలకు రూ.14లక్షల కోట్లు మాఫీ చేసిందని ఆరోపించారు. రైతులకు, పేదలకు ఒక్క రుపాయి కూడా మాఫీ చేయలేదని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏమైనా నిధులు తెచ్చారా? : కేసీఆర్ - KCR bus trip in Karimnagar

BRS Candidates Election Campaign : బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్‌ మారుతుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదని, ట్రస్ట్‌ కట్టించిందన్న ఆయన తను కూడా నిర్మాణానికి రూ.2లక్షలు విరాళం ఇచ్చినట్లు తెలిపారు.

"ఇగ కాంగ్రెసోళ్ల గురించి చెప్పడం అవసరముందా కల్యాణ లక్ష్మి చెక్కు బౌనస్‌ అయ్యింది. తులం బంగారం తుస్సుమంది. నిన్న సరూర్‌నగర్‌లో సభలో కూడా కూలర్‌లు పెట్టి, ఫ్యాన్లు పెట్టి రాహుల్‌ గాంధీ మీటింగ్‌కు 30వేల కుర్చీలు వేస్తే 3వేల మంది కూడా రాలేదు. రేవంత్‌ ఏమో అందరూ మీటింగ్‌కు రావాలని పిలిచాడు. అయినా ఎవ్వరూ సభకు పోలె. దీంతో అర్థమైంది కాంగ్రెస్‌ అంతా తుస్సు, తుస్సు అని." - హరీశ్‌రావు, మాజీ మంత్రి

గురువారం రాహుల్‌ గాంధీ సభ తుస్సుమందని, 30వేల కుర్చీలు వేస్తే 3వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు వచ్చి ఓట్లు అడిగితే ఐదు నెలల మహాలక్ష్మి పైసలు రూ.12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని చెప్పాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్‌ గెలిచాక ప్రియాంక గాంధీ ఇస్తామన్న మెడికల్‌ కాలేజీ ఇచ్చారా అని ప్రశ్నించారు. గ్యారంటీలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి కంటే రాహుల్‌ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన పేరు రాహుల్‌ గాంధీ కాదని రాంగ్‌ గాంధీ అని విమర్శించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని, అసలు గెలిచే సవాలే లేదన్నారు.

మాకు 12 సీట్లు ఇస్తే, గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - lok sabha elections 2024

కాంగ్రెస్​ ఐదు నెలల పాలనలోనే రాష్ట్రం ఆగమాగం అయింది : కేసీఆర్​ - KCR Bus Yatra in Medak

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.