ETV Bharat / politics

'ప్రజా పాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? - ప్రతిపక్షాలను అడ్డుకోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం' - KTR on Gandhi Hospital Incident

KTR on Gandhi Hospital Incident : గాంధీ ఆసుపత్రి వద్ద నిరుద్యోగ యువకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్​ను పరామర్శించేందుకు వెళితే యువకులపై లాఠీ ఛార్జ్ చేయడం ఏంటని ఆక్షేపించారు. ప్రజా పాలనలో పరామర్శించటం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR on Gandhi Hospital Incident
KTR Reaction on Gandhi Hospital Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 7:31 PM IST

KTR Reaction on Gandhi Hospital Incident : డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్​ను పరామర్శించేందుకు వెళితే నిరుద్యోగ యువకులపై లాఠీ ఛార్జ్ చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు. ప్రజా పాలనలో పరామర్శించటం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరుద్యోగులను తరుముతూ పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ యువకుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్​ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేత రాకేశ్​ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులను అడ్డుకొని అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పార్టీ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువకుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా, వారికి సంఘీభావం తెలుపుతున్న యువకులు, ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం : ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను మానుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగులు, యువకులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్​లను వెంటనే జారీ చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్​ను డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్​ఎస్​ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఆయన, ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ల హామీ కోసం అన్ని సభల్లో నిలదీస్తాం : కేటీఆర్​ - Job Aspirants Meet KTR in Hyderabad

వారితో రాజీనామా చేయించి, ఎన్నికలకు రండి : మరోవైపు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్​ రెడ్డికి దమ్ముంటే, హస్తం పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రావాలని సవాల్​ విసిరారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లిన వారిని ఓట్లతో కొట్టి శాశ్వతంగా రాజ‌కీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

నాడు ఎన్నికల​ ప్రచారంలో నీతులు - నేడు ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా? : కేటీఆర్​ - KTR Serious Comments on CM Revanth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.