ETV Bharat / politics

'ఇచ్చిన గ్యారంటీలకు, బడ్జెట్‌ కేటాయింపులకు పొంతనే లేదు - బీజేపీ మౌనం వెనక మర్మమేంటి?' - కాంగ్రెస్​పై నిరంజన్​ రెడ్డి ఫైర్

Ex Minister Niranjan Reddy Fires on Congress : కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన గ్యారంటీలకు, బడ్జెట్‌ కేటాయింపులకు పొంతన లేదని ఆయన ఆక్షేపించారు. అసెంబ్లీలో ఒక్క హరీశ్‌రావును ఎదుర్కొనేందుకు ఆరుగురు మంత్రులు ఏకమై దాడి చేశారని నిరంజన్‌ ఆరోపించారు. హిమాచల్​ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హామీలపై పోరాడే బీజేపీ, తెలంగాణలో ఎందుకు మౌనవ్రతం దాల్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

BRS Leader Niranjan Reddy on Congress
Ex Minister Niranjan Reddy Fires on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 7:59 PM IST

Ex Minister Niranjan Reddy Fires on Congress : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో కమలం పార్టీ నేతలకు నొప్పి వస్తుందన్నారు. బీఆర్​ఎస్​, కేసీఆర్(KCR) మీద బురదజల్లిన బీజేపీ, కాంగ్రెస్​ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బీఆర్​ఎస్​ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

బీసీ కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలి : కేటీఆర్‌

ఉచిత బస్సు తప్ప, 72 రోజుల్లో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Meetings) సమస్యలు, హామీలకు పరిష్కారం లేదన్నారు. ప్రత్యామ్నాయం కూడా లేదన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్​లో సరిపడా కేటాయింపులు లేవని ఆరోపించారు.

BRS Leader Niranjan Reddy on Congress : 72 రోజుల్లోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా ప్రభుత్వం తేల్చిచెప్పింది అన్నారు. మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి, గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. హరీశ్​రావు(Harish Rao) జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. సాంప్రదాయాలకు భిన్నంగా నీటి పారుదల శాఖ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరమన్నారు.

"అసెంబ్లీలో ఒక్క మా హరీశ్‌రావును ఎదుర్కొనేందుకు సీఎం సహా ఆరుగురు మంత్రులు ఏకమై కసరత్తు చేశారు. సంబంధం లేనటువంటి శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా చర్చల మధ్యలో కలగజేసుకోవటం జరిగింది. వాళ్లు వ్యవహరించిన తీరుపై వారే పునః సమీక్షించుకోవాలి. హిమాచల్​ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హామీలపై పోరాడే బీజేపీ, తెలంగాణలో ఎందుకు మౌనవ్రతం దాల్చింది. పార్టీ మార్పులు ఏమైనా జరిగాయా?" - నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి

గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా ప్రభుత్వం తేల్చిచెప్పింది : నిరంజన్​ రెడ్డి

ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం - కాంగ్రెస్​ సర్కార్​పై బీఆర్​ఎస్ నేతల ధ్వజం

రాష్ట్రంలో కరెంట్‌ కోతలు మొదలయ్యాయి : 15 నెలల క్రితం హిమాచల్​ప్రదేశ్​లో 10 గ్యారంటీలు, 8 నెలల క్రితం కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, 72 రోజుల క్రితం తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీల అమలులో విఫలమయిందని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. మూడెకరాలకు మించి రైతుబంధు (Rythu Bandhu) ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. రైతు భరోసా అమలు చేస్తారా, చేయరా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం మీద ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నంలో ఉందన్నారు. కాళేశ్వరంపై(Kaleswaram Project) అత్యున్నత స్థాయిలో విచారణ జరిపించాలని, ప్రభుత్వం కాంగ్రెస్​ చేతిలోనే ఉంది కదా అని గుర్తు చేశారు. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. బీఆర్​ఎస్​ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేక గారడీలు చేస్తున్నారు - కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్‌

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేవరకు మా పోరాటం కొనసాగుతుంది : నిరంజన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.