ETV Bharat / politics

కాంగ్రెస్ పార్టీ -​ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంది : హరీశ్ రావు - brs mla Harish on Ed raids

BRS MLA Harish Rao on ED Raids : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగినందున నేడు ఎమ్మెల్యే సోదరులను కలిసి వివరాలు తెలుసుకున్నారు.

BRS MLA Harish Rao on ED Raids in BRS MLAs House
BRS MLA Harish Rao on ED Raids (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 12:52 PM IST

BRS MLA Harish Rao on ED Raids in BRS MLAs House : అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. గురువారం పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఈడీ అధికారుల సోదాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వచ్చారు.

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే - ఆయన బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు - ED Raids MLA Mahipal Reddy house

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిహార్, గుజరాత్​లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని ప్రశ్నించారు.

నీట్ పరీక్షాపత్రాన్ని అమ్ముకున్న కేంద్రం : తెలంగాణ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాశాయి. వారి భవిష్యత్తు అయోమయంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధికార పార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా, కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయటం దారుణమన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని హరీశ్ రావు తెలిపారు.

ED Raids in BRS MLA House : పటాన్​చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు గురువారం సోదాలు జరిపారు. పటాన్​చెరులోని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి నివాసం, అతని సోదరుడు మధుసూదన్​రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్​చెరులోని మూడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిపారు.

పొంగులేటిపై "ఐ" టీ దాడులు- నివాసాలు, కార్యాలయాల్లో రోజంతా ఆదాయశాఖ సోదాలు

రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం - కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి ఇంట్లో సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.