Tamilisai Election Campaign in Telangana 2024 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
BJP Election Campaign in Telangana : మరోవైపు బీజేపీ అగ్ర నేతలు తెలంగాణకు వరుస కడుతున్నారు. సభలు సమావేశాల పేరిట వారు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ, కమలం పార్టీకి ఓటు వేయాలని ఓట్లర్లను అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆశీర్వాదించాలని కోరుతున్నారు. అవినీతి పార్టీలను అంతమొందించాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు రావాలంటే తమ పార్టీ అభ్యర్థులకే ఓటేయాలని విన్నవిస్తున్నారు. దీంతో పాటుగా ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశంపై వారు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
తమిళిసైకి ఘన స్వాగతం పలికిన శ్రేణులు : ఈ క్రమంలోనే నేటి నుంచి రాష్ట్రంలో తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ ప్రచారం నిర్వహించనున్నారు. 10 రోజులపాటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.
గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై సౌందర రాజన్, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో తెలంగాణలో పది రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు తమిళిసై ఇక్కడికి వచ్చారు.
బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు : కిషన్ రెడ్డి - Kishan Reddy Fires On Congress