ETV Bharat / politics

ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మద్దతు పొందాం : ఈటల రాజేందర్​

Etela Rajender Comments on Congress : కాంగ్రెస్​ అమలుకు సాధ్యమవ్వని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్, దుబ్బాకలో సాంకేతికంగా తాను, రఘునందన్ ఓడిపోయిన ప్రజలు మద్దుతు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో మెదక్​ నియోజకవర్గంలో బీజేపీ గెలిచేలా కార్యకర్తలను దిశానిర్దేశం చేశారు.

BJP Followers Meeting at Medak
Etela Rajender Comments on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 7:59 PM IST

Etela Rajender Comments on Congress : వచ్చే లోక్​సభ ఎన్నికల్లో మెదక్​ నియోజకవర్గంలో కమలం పాటి వికసించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్(Etela Rajender) అన్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని తెలిపారు. మెదక్ పార్లమెంట్​లోని బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు నేరుగా కలిసి కేంద్రం ప్రభుత్వం చేపట్టిన పనులను తెలియజేయాలని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వారికి ప్రజలు ఓటు ద్వారా మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మళ్లీ తమ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించారు.

లోక్​సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి

BJP Followers Meeting at Medak : ప్రపంచంలో ఆర్థికంగా వెనకబడిన దేశాల్లో ఒకటిగా ఉన్న భారతదేశాన్ని ఐదో స్థానంలో నిలబెట్టిన ఘనత నరేంద్ర(Narendra Modi) మోదీదే అని ఈటల కొనియాడారు. బీజేపీ ఎప్పుడు ఇతర మతాలను కించపరిచే విధంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. హిందూ మత అస్థిత్వాన్ని, రావాల్సిన హక్కుల కోసం పోరాడిందే తప్పా ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వందల సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్మించిన ఘనత నరేంద్ర మోదీదని కొనియాడారు.

విద్యార్థి దశ నుంచి ఓటమి తెలియదు - గజ్వేల్​లో ఓటమి నాలో కసిని పెంచింది : ఈటల రాజేందర్

"మెదక్​ లోక్​సభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. హిందూ మతానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం."- ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

Etela Rajender on Parliament Elections 2024 : ప్రజలు కేసీఆర్​పై కోపంతో కాంగ్రెస్​కు ఓటు వేసారే తప్పా కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తుందని కాదని ఈటల రాజేందర్​ అన్నారు. అమలుకు సాధ్యమవ్వని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసినందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్​కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. గజ్వేల్, దుబ్బాకలో సాంకేతికంగా తాను, రఘునందన్ ఓడిపోయిన ప్రజలు తమ మద్దతు చూపారని అన్నారు. ప్రతిపక్షాలు అధికారపక్షం పరస్పరం చర్చలు జరిపితేనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని సలహా ఇచ్చారు. కానీ నేడు ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకులు కలవడమే తప్పు అనే మాదిరిగా వ్యవస్థ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.

హరీశ్​రావుకు పార్టీలో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు : ఈటల రాజేందర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.