ETV Bharat / politics

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్లు - పోలీసులపై సస్పెన్షన్​ వేటు - పోలీసులపై సస్పెన్షన్​ వేటు

EC Action on Tirupati Police: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల అక్రమాలు తవ్వకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దొంగ ఓటర్లే కాదు, ఈ నకిలీ ఓట్ల దందాలో పోలీసుల ప్రమేయమూ బయటపడింది. జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు వేయించడంతో పోలీసుల నిర్వాకం చర్చనీయాంశంగా మారింది.

EC_Action_on_Tirupati_Police
EC_Action_on_Tirupati_Police
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 2:23 PM IST

Updated : Feb 12, 2024, 6:24 AM IST

EC Action on Tirupati Police: తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్‌ ఎస్​హెచ్​ఓగా పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ బీవీ శివప్రసాద్‌రెడ్డి, ఎస్సై ఏ. జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్‌ కె. ద్వారకానాథ్‌రెడ్డి.. తిరుపతి పశ్చిమ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ సస్పెండయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అలిపిరి పోలీసుస్టేషన్‌లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్రకుమార్‌లను వీఆర్‌కు పంపించారు.

కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు జరిగితే సూత్రధారులైన వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితోనే అంటకాగి కేసులకు సమాధి కట్టేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగ లాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలుతే తీగ తెంపేశారు. దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డ వారిని విచారించటం మాట అటుంచి కనీసం వారి వద్దనున్న పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఉపఎన్నికల సందర్భంగా ఈఆర్వో లాగిన్, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేయించటం, ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారికి కార్డులు, ఓటర్లు స్లిప్పులనిచ్చి దొంగ ఓట్లు వేయించటం, అలా ఓటేస్తూ ఎవరైనా పట్టుబడి కేసు నమోదైనప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయకుండా మూసేయించటంలో అధికార పార్టీ నాయకుల నేరపూరిత కుట్ర కళ్లకు కడుతోంది. దొంగ ఓట్ల దందాను నడిపించారని ప్రతిపక్షాల ఆరోపణలు, ఫిర్యాదులను ఎదుర్కొంటున్న తిరుపతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల జోలికి ఎన్నికల సంఘం వెళ్లకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

2021 ఏప్రిల్‌ 17న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్‌ జరిగింది. నగరంలోని స్కావెంజర్స్‌ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద ఎస్‌.అయ్యప్ప అనే 21 ఏళ్ల యువకుడు.. కొసన రామచంద్ర ఎపిక్‌ కార్డు, ఓటరు స్లిప్పుతో ఓటేసేందుకు నిల్చోగా ప్రతిపక్షాలవారు పోలీసులకు అప్పగించారు. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ బి.మునికృష్ణ, అయ్యప్పను తూర్పు పోలీసుస్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు.

ఉపఎన్నికల్లో అక్రమాల ఫలితం- ఓ ఐఏఎస్​ అధికారి సస్పెండ్​ మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం

దొంగ ఓట్లు వేయడం అత్యంత తీవ్రమైన నేరం కాబట్టి హెడ్‌కానిస్టేబుల్‌ కె.ద్వారకానాథ్‌రెడ్డి సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. అయితే ఆయన బెయిల్‌కు వీలైన తేలికపాటి సెక్షన్లు.. ఐపీసీ 171 ఎఫ్‌ , 188 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, పోలింగ్‌ అధికారులు, అక్కడ భద్రత విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సంఘటన సమయంలో ప్రత్యక్షసాక్షులుగా ఉన్న ఓటర్లను కనీసం విచారించనే లేదు. నిందితుడి వద్దనున్న నకిలీ ఓటరు కార్డు, ఎపిక్‌ కార్డు, ఆధార్, ఇతర పత్రాలనూ సీజ్‌ చేయలేదు. కేసు దర్యాప్తు ఇక్కడే పక్కదారి పట్టింది.

కేసు దర్యాప్తు అధికారి, ఎస్సై ఏ.జయస్వాములు అసలు నేర సంఘటనా స్థలాన్నే సందర్శించలేదు. దొంగ ఓట్ల నేరాన్ని నిరూపించేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించాల్సిన ఆయన.. అది వదిలేసి ఈ నేరాన్ని ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ సంఘటనగా పేర్కొంటూ ఆ మేరకు ఐపీసీ సెక్షన్‌ 290 కింద కేసును మార్చేస్తూ న్యాయస్థానంలో మెమో, అభియోగపత్రం సమర్పించారు. దీనికి ఉన్నతాధికారుల అనుమతినీ తీసుకోలేదు. కేసును నిర్వీర్యం చేశారు.

తిరుపతి దొంగ ఓట్ల ఘటన - మరో అధికారిపై వేటు

తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన బి.వి.శివప్రసాద్‌రెడ్డికి ఈ దొంగ ఓట్ల సంఘటన గురించి, నమోదైన కేసు గురించి అవగాహన ఉంది. స్టేషన్‌ అధిపతిగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేయాల్సిన ఆయన అసలు ఆ విషయమే పట్టించుకోలేదు. పోలీసు అధికారులు బి.వి.శివప్రసాద్‌రెడ్డి, ఏ.జయస్వాములు, కె.ద్వారకానాథ్‌రెడ్డిలు.. వైకాపా నాయకుల కుట్రలో భాగస్వాములై కేసును నీరుగార్చేశారు. పబ్లిక్‌ న్యూసెన్స్‌ సంఘటన కింద మార్చేసి అభియోగపత్రం సమర్పించడంతో న్యాయస్థానం నిందితుడికి 200 రూపాయల జరిమానా విధించి కేసు మూసేసింది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో అక్రమాలపై తిరుపతి తూర్పు, పశ్చిమ, ఎమ్మార్‌పల్లి, అలిపిరి, యూనివర్సిటీ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో చాలా కేసులను పోలీసులు మూసేశారు. మరికొన్ని తప్పుడు కేసులంటూ తేల్చేశారు. ఇంకొన్ని కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించేశారు. కేసులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ వ్యవస్థీకృత నేరంగా పరిగణించి సూత్రధారుల్ని పట్టుకోవాల్సి ఉండగా ఆ పనే చేయలేదు. ఉపఎన్నిక సమయంలో ఎస్పీగా చింత వెంకటప్పలనాయుడు ఉన్నారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన దొంగ ఓటర్లను ఆయన అడ్డుకోలేదన్న విమర్శలున్నాయి. అనంతరం ఆ జిల్లా ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేసుల ఎత్తివేత, దర్యాప్తు పక్కదారి పట్టించేలా చేయటంలో ఆయనదే ప్రధాన పాత్రనే విమర్శలున్నాయి. దీనిపై విచారించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల ఆదేశాలే చట్టమన్నట్టుగా పనిచేస్తారన్న విమర్శలున్నాయి. వైకాపా కోసం అంతలా పనిచేసే ఆయనే.. చివరికి దొంగ ఓట్ల కేసులను నీరుగార్చిన తన సిబ్బందిపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని చర్చించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సీరియస్‌గా దృష్టి సారించటంతో తప్పనిసరై బాధ్యులపై ఆయన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

వేషాలు వేస్తే వేటే- రెండేళ్లనంతరం తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర

Last Updated : Feb 12, 2024, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.