ETV Bharat / politics

తెలంగాణ బీజేపీలో మార్పులు - జాతీయ ప్రధాన కార్యదర్శిగా డీకే అరుణ! - రాష్ట్ర చీఫ్​గా ఈటల? - BIG POSTS TO TELANGANA BJP LEADERS - BIG POSTS TO TELANGANA BJP LEADERS

BJP National General Secretary Post To DK Aruna: కేంద్రమంత్రివర్గం కొలువుతీరడంతో పార్టీ సంస్థాగత బలోపేతంపై బీజేపీ దృష్టిసారించింది. పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని భావిస్తోంది. బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం జూలై నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారంచుట్టనుంది. బూత్‌, మండల, జిల్లా కమిటీలు పూర్తిచేసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీ సంప్రదాయం. కానీ మంత్రివర్గంలో తెలంగాణ, బంగాల్‌ రాష్ట్ర అధ్యక్షులకు చోటు దక్కడం సహా లోక్‌సభ ఎన్నికల్లో నిరాశ కనబర్చిన రాష్ట్రాల అధ్యక్షులని మార్చాలని భావిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల తర్వాత కొత్త అధ్యక్షుల నియామకం ఉంటుందని పార్టీశ్రేణుల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటల రాజేందర్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

BJP To Focus Change Position of Leaders
BJP Focus To Change State Chiefs in Few States (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 10:48 AM IST

Telangana BJP New Chief Etela Rajender : లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్లిన బీజేపీ ఆశించిన సీట్లు సాధించకపోవడంతో కేంద్రంలో సంకీర్ణప్రభుత్వం కొలువుతీరింది. ఉత్తరాది నుంచి భంగపాటు ఎదురైనా దక్షిణాదిన కమలంపార్టీకి మంచిఫలితాలు వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు ప్రధాని మోదీ పెద్ధ పీటవేశారు. రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి కేంద్రం మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ ఇద్దరి పదవుల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఒక్క వ్యక్తికి ఒకే పదవి అనే నినాదంతో ముందుకెళ్తున్నందున కేంద్రమంత్రి వచ్చిన వారి నుంచి పార్టీ పదవులు తప్పించి కేబినెట్‌లో పదవి ఆశించి భంగపడిన ఎంపీలకు కట్టబెట్టాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది.

ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు : 2019 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే కిషన్‌రెడ్డిని మాత్రమే కేంద్రమంత్రి పదవి వరించింది. ఈసారి 8 ఎంపీలు గెలవడంతో కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌కి మంత్రులుగా ప్రమాణం చేశారు. మల్కాజ్‌గిరినుంచి అధిక మెజార్టీతో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షాతో ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు.

తెలంగాణ ఏపీల్లో ఏ రాష్ట్రం పట్ల మాకు వివక్ష లేదు : కిషన్​ రెడ్డి - kishan reddy about BJP New Government

ఈటలతో పాటు అధ్యక్షపదవిని ఆశిస్తున్న చాలామంది దిల్లీలో మకాం వేసి లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. ఎంపీలుగా గెలిచిన డీకే అరుణ, రఘునందన్‌రావు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈటల కంటే ముందే బీజేపీలో ఉండటం సహా జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న తనకే అధ్యక్ష పదవి వస్తుందని అరుణ ధీమాతో ఉన్నారు. వారితో పాటు పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. బంగారు లక్ష్మణ్‌ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి దళితులకు దక్కనందున ఈసారి తమకే ఇవ్వాలని పార్టీలోని దళిత నేతలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఈటలకు అప్పగిస్తే డీకే అరుణని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీకి అధ్యక్షపదవి కేటాయిస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షపదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు అధిష్ఠానం పెద్ద పీట వేస్తుందని పార్టీశ్రేణులు అంచనా వేస్తున్నారు. కొత్త అధ్యక్షుడిగా ఎప్పుడు నియమిస్తారనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

కిషన్​రెడ్డి, బండి సంజయ్​లకు శాఖలు ఖరారు - TG Cabinet Ministers Portfolios

బండి సంజయ్​కు కేంద్రమంత్రి పదవి - శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎంపీలు - BJP MPs CONGRATULATES BANDI SANJAY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.