ETV Bharat / politics

నేడు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కేసీ వేణుగోపాల్ భేటీ - మిగతా మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన! - LOK SABHA ELECTIONS 2024 - LOK SABHA ELECTIONS 2024

Congress MP Candidates in Telangana 2024 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించి, రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం 7:00 గంటలకు శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్‌ మున్షీలతోపాటు ముఖ్యనాయకులు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అవుతారు. రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

KC Venugopal Meeting Congress Leaders Today

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 8:52 AM IST

Updated : Apr 14, 2024, 9:10 AM IST

నేడు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కేసీ వేణుగోపాల్ భేటీ

Congress MP Candidates in Telangana 2024 : రాహుల్ గాంధీని (Congress Lok Sabha Polls 2024) ప్రధాన మంత్రిని చెయ్యాలన్నది తెలంగాణ పీసీసీ ప్రధాన ధ్యేయం. రాష్ట్రంలో కనీసం 14 లోక్‌సభ స్థానాలను గెలిచి తీరాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న హస్తం పార్టీ ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 17 పార్లమెంట్‌ స్థానాలకుగాను 14 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ మరో మూడు స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరక పెండింగ్‌లో పెట్టింది. ఈ క్రమంలోనే ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

KC Venugopal Meeting Congress Leaders Today : ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షీలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో (Bhatti and Deepak Munshi Meet CM Revanth) భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతోపాటు పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల కసరత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు నేతలు ఏకాభిప్రాయానికి రావాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఇవాళ కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌ వస్తున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానం సూచనలతో ఆయన వస్తున్నారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై శనివారం నాడు చర్చించిన వారు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

తుక్కుగూడ సభకు అనూహ్య స్పందన - కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్​ - 14 సీట్లకు ఇక ఢోకా లేదు! - LOK SABHA ELECTIONS 2024

Congress Election Campaign in Telangana : బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని వేగవంతం చేయడంతో కాంగ్రెస్‌ కూడా ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌లో రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కూడా పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి.

ప్రధానంగా నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ఎలాంటి అభిప్రాయం ఉంది? అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గాల వారీగా హస్తం పార్టీ ఓటు బ్యాంకు ఎంత? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటు బ్యాంకు ఎంత? ఇప్పుడు అది ఎంత శాతం పెరిగింది? అనే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరెవరు బరిలో ఉన్నారు? అక్కడ ఆయా పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఎంత? కాంగ్రెస్‌ గెలిచేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలు ఎన్ని? నిర్దేశించిన లక్ష్యం మేరకు 14 లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం : రాహుల్‌ గాంధీ - Tukkuguda Congress Meeting 2024

తాజా రాజకీయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ : సునీల్‌ కనుగోలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈరోజు నోవాటెల్‌లో జరగనున్న సమావేశంలో సునీల్‌ కనుగోలు తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే ఏయే పార్టీల అభ్యర్థులతో హస్తం పార్టీకి గట్టి పోటీ ఉంది? దానిని ఎలా అధిగమించాలి? తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Lok Sabha Elections 2024 : మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఎమ్మెల్యేలు, మంత్రులు, పోటీ చేయనున్న అభ్యర్థులకు తెలియజేస్తారు. ఎక్కడైనా పార్టీ బలహీనంగా ఉన్నట్లయితే ,అక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశాలను వివరించనున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండడంతో,ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలి? ఎవరెవరు ఏయే బాధ్యతలు తీసుకోవాలి? వాటిని సమర్ధవంతంగా ఎలా నిర్వర్తించాలి తదితర అంశాలపై చర్చించి కేసీ వేణుగోపాల్‌ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు రేవంత్ సైన్యం సిద్ధం - వాటికి ఆధారాలతో కూడిన కౌంటర్ - LOK SABHA ELECTIONS 2024

మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం - జాతీయ నాయకులతో బహిరంగ సభలు - Lok Sabha Elections 2024

Last Updated : Apr 14, 2024, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.