ETV Bharat / politics

పాలమూరు-రంగారెడ్డి నిధులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం : కాంగ్రెస్‌ - కాంగ్రెస్ నాయకుల పాలమూరు సందర్శన

Congress leaders Palamuru Rangareddy Project Tour : పదేళ్ల కేసీఆర్​ పాలనలో కాళేశ్వరం పేరుతో ఉత్తర తెలంగాణను బొందలగడ్డ చేస్తే, పాలమూరు-రంగారెడ్డి అంటూ దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని కాంగ్రెస్‌ ఆరోపించింది. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తానన్న కేసీఆర్‌, ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా అని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల సందర్శనలో భాగంగా వివిధ జలాశయాల పనులను వారు పరిశీలించారు. బీఆర్​ఎస్​ నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించేందుకే పర్యటన చేపట్టామన్న నేతలు, అవినీతి, అక్రమాలను బయటికి తీస్తామన్నారు.

Congress Leaders Visit Palamoor Rangareddy Project
Congress Leader Vamshi Chand Fires on KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 3:17 PM IST

Updated : Mar 1, 2024, 7:57 PM IST

పాలమూరు-రంగారెడ్డి నిధులపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం : కాంగ్రెస్‌

Congress leaders Palamuru Rangareddy Project Tour : లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అంశం, అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ మంటలు రేపుతోంది. చలో మేడిగడ్డ పేరుతో బీఆర్​ఎస్​(BRS) కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరగా, 'చలో పాలమూరు-రంగారెడ్డి' పేరుతో కాంగ్రెస్‌ నేతలు జలాశయాల పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు.

ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో గల కరివేన జలాశయానికి చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు, రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. జలాశయం నిర్మాణం పనులు, కొనసాగుతున్న తీరు, నిధులకు సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తానన్న కేసీఆర్‌(KCR), ఎకరానికైనా నీరివ్వలేక పోయారని కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో వాటా విషయంలోనూ గత బీఆర్​ఎస్​ సర్కార్‌ విఫలమైందన్న ఆయన, ఆంధ్రపాలకులు నీటిని తరలించుకుపోతుంటే వారికి సహకరించారని విమర్శించారు. ప్రాజెక్టుల్లో బీఆర్​ఎస్​ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

'తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తే, బీఆర్ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు వచ్చింది 212 టీఎంసీలు మాత్రమే. మనకు వచ్చే వాటా బీఆర్​ఎస్​ సాధించలేకపోయింది. వచ్చిన వాటాను కూడా ఉపయోగించలేకపోయింది. మనకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్​కు పోతుంటే గత ప్రభుత్వం అలసత్వం వహించింది.'- వంశీచంద్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు

Congress Leaders about Palamuru Rangareddy Project : అనంతరం ఉద్దండాపూర్‌ జలాశయాన్ని కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. 2015లో ప్రాజెక్టు ప్రారంభం కాగా ఇప్పటికీ భూసేకరణ సైతం పూర్తికాలేదని, రైతులకు నష్ట పరిహారాన్నీ అందించలేకపోయారని ఆరోపించారు. ధనార్జన కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉపయోగించుకున్నారని, నిధుల అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం రెండో విడతలో చేపట్టాలని భావించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌(Lakshmidevipally Reservoir) ప్రతిపాదిత ప్రాంతాన్ని కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు.

'కరివెన ప్రాజెక్టు సందర్శనకు వెళితే అక్కడ 30 శాతం పనులు కాలేదు. ఉద్దండాపూర్‌కు వస్తే, ఇక్కడ బొందల గడ్డలాగా ఉంది. అక్కడో గుట్ట, ఇక్కడో గుట్ట తప్ప ప్రాజెక్టు రూపం కూడా సంతరించుకోలేదు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు, ఏమీ లేకుండా ప్రాజెక్టు 80 శాతం పూర్తి అయ్యిందంటున్నారు. 2014లో అధికారం వచ్చిన తర్వాత రూ. 12 వేల కోట్లు 35 వేల కోట్లు అయిపోయాయి.'- యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే

'ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు' - కేంద్ర జల్‌శక్తి శాఖకు చేరిన అసెంబ్లీ తీర్మానం

'ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యం' - మేడిగడ్డకు బయల్దేరిన గులాబీ సైన్యం

Last Updated : Mar 1, 2024, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.