Congress Leader Jagga Reddy Comments on KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయి ఫ్రస్టేషన్‌తో ఏదిపడితే అది మాట్లాడుతున్నారని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో(Parliament Election) తాము, రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వంద రోజుల రేవంత్ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వానికి అవమానం రెండు, రాజ్యపూజ్యం 16 అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో టీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేసే మహిళల్ని అడగాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులపై(Party Defections) తాను ఇప్పుడు మాట్లాడనని, పలు పార్టీల నుంచి వచ్చిన తాను పార్టీ ఫిరాయింపులపై స్పందించటం తగదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, బీజేపీ పదవులను కోరుకునే ఫ్యామిలీ అని ఆయన విమర్శించారు.
హుటాహుటిన దిల్లీకి జగ్గారెడ్డి - కాంగ్రెస్ వర్గాల్లో చర్చ
"మాజీ సీఎం కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఎందుకంటే తొమ్మిదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇప్పుడేమే ఉన్నపాటుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం ఎక్కించేసరికి ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో అవగాహనలేని ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఈ మూడు నెలల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో తెలియాలంటే, ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు అడిగితే వారే బదులిస్తారు. ఎంత సంతోషంగా ఉన్నారో, ఆర్థిక భారం లేకుండా ప్రయాణిస్తున్నారో వివరిస్తారు." -జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
పీసీసీ చీఫ్ పదవి కోరుకోవడం తప్పు కాదు : రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారన్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ఓ సారి బీజేపీ అంటారని, ఇంకోసారి కాంగ్రెస్ అంటారని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్(PCC Chief) పదవి తాను కోరుకోవడం కొత్తకాదు, అడగడం తప్పు కాదని వివరించారు. పీసీసీ మార్పునకు ఇంకా కొంత సమయం ఉందని, తొందరేమి లేదని వ్యాఖ్యానించారు.
పీసీసీ అధ్యక్షుడుగా, సీఎం ఒక్కరే ఉంటే బాగుంటుందని అధికార నాయకత్వం రేవంత్ రెడ్డినే(CM Revanth Reddy) కొనసాగిస్తున్నారని తెలిపారు. మందకృష్ణ మాదిగ బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించిన జగ్గారెడ్డి, తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని కాషాయ పార్టీని ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు.
'బలవంతుడి టైం అయిపోయే దాక బలహీనుడు సైలెంట్‌గానే ఉంటాడు' - జగ్గారెడ్డి చెప్పిన కథ వింటారా
'నన్ను ఓడించేందుకు హరీశ్‌రావు రూ.60 కోట్లు ఖర్చు చేశాడు - భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయను'