ETV Bharat / politics

వీహెచ్‌కు బుజ్జగింపులు - అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్​ ​భరోసా - VH meets CM Revanth Reddy

Congress Leader Hanumantha rao Meets CM Revanth : సీఎం రేవంత్​ రెడ్డి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. టికెట్‌ రాలేదని ఇబ్బంది పడొద్దన్న రేవంత్​, అన్ని విధాలుగా అండగా ఉంటానని వీహెచ్​కు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Hanumantha rao Meeting With CM
Congress Leader Hanumantha rao Meets CM Revanth
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 27, 2024, 10:26 PM IST

Congress Leader Hanumantha rao Meets CM Revanth : పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశించిన ఆయన తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఈయన దూరంగా ఉంటూ వచ్చారు. రెండు రోజుల కిందట వీహెచ్‌ మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంను కలిసి మాట్లాడేందుకు అవకాశం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్‌తో మాట్లాడారు.

Hanumantha rao Meeting With CM : ఇవాళ ఉదయం హనుమంత రావును వెంట తీసుకెళ్లిన మహేశ్​ కుమార్‌ గౌడ్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించారు. వీహెచ్‌, సీఎం ఇద్దరు ఏకాంతంగా సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. టికెట్‌ రానంత మాత్రాన ఇబ్బంది పడొద్దని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి, అన్ని విధాల అండగా ఉండనున్నట్లు హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. నాయకులందరినీ కలువుకుని వెళ్లాలన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి, అలకబూనిన వీహెచ్‌ లాంటి నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Congress Leader VH on Revanth Reddy : ఇదికాగా ఈ నెల 23న వీహెచ్​ సీఎం రేవంత్​రెడ్డిని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌(BRS)పీడ పోయిందన్న రేవంత్​రెడ్డి, ఇప్పుడు మళ్లీ ఎందుకు ఆ పార్టీ వాళ్లను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని హనుమంత రావు ప్రశ్నించారు. తాజా రాజకీయ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న నాయకులను పక్కన పెట్టి, బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సీఎంలో మార్పు రావాలని, అందరికీ న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

బీఆర్​ఎస్ నేతలను కాంగ్రెస్​లోకి ఎందుకు చేర్చుకుంటున్నారు : వీహెచ్‌ - Congress Leader VH Fire on CM

ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతా : వి.హనుమంతరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.