Congress Focus On Chevella MP Seat : రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో హస్తం పార్టీ(Congress Party) తన హవా చాటాలనుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే తన వర్గంతో కలిసి రంగంలోకి దిగిన రంజిత్ రెడ్డి స్థానిక నేతలతో(Local Leaders) వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Congress Party Election Campaign : పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలను, ప్రజలను కోరుతున్నారు. ఎంపీగా ఐదేళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో మరింత అభివృద్ధికి పాటుపడతానని ప్రచారం నిర్వహిస్తున్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమ్మిళితంగా ఉండే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో(Parliamentary Constituency) గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్లలో గులాబీ పార్టీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) రంజిత్‌రెడ్డి వికారాబాద్ జిల్లా ఇంఛార్జీగా బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS Candidates) కోసం పనిచేశారు.
ప్రచారంలో జోష్ పెంచిన కాంగ్రెస్ పార్టీ : అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులను(Congress Candidates) ఓడించేందుకు క్షేత్రస్థాయిలో మంతనాలు సాగించారు. ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాల్లో క్యాడర్ రంజిత్‌రెడ్డికి ప్రతికూలంగా మారింది. కాంగ్రెస్ క్యాడర్ రంజిత్‌రెడ్డి రాకను మొదట్లో వ్యతిరేకించగా వేం నరేందర్ రెడ్డి సయోధ్య కుదర్చారు. దీంతో రంజిత్‌రెడ్డి గెలుపునకు కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు ప్రకటించడంతో పశ్చిమాన కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జి కేఎల్ఆర్ సైతం రంజిత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లోనూ స్థానిక నేతలు, కార్పొరేటర్లను కలుపుకుంటూ శ్రమిస్తున్నారు.
Congress Party Election Strategy : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లక్ష ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఆ ఫలితాలను బేరీజు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇక్కడ 2009లో గెలిచిన కాంగ్రెస్ 2014, 2019లో ఓడిపోయింది. కానీ ఈ సారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పార్లమెంట‌్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో చేవెళ్ల పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ధీమాగా ఉన్నారు.
బీఆర్ఎస్ కంటే బీజేపీనే తన ప్రత్యర్థిగా భావిస్తోన్న రంజిత్‌రెడ్డి రాముడ్ని అడ్డుపెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతుందని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రజలకు(People) అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే తాను కావాలో లేక దూరంగా ఉండే విశ్వశ్వర్ రెడ్డి కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
Changing Political situations In Chevella : చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలు ఆ ప్రాంత రాజకీయానికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఒకసారి ఎంపీగా గెలిచిన నాయకుడు(Leader) ఐదేళ్లు తిరిగే సరికి మరో పార్టీలో చేరిపోవడం ఆనవాయితీగా మారుతోంది. 2014లో ఎన్నికల్లో(2014 Elections) గెలిచిన విశ్వేశ్వర్ రెడ్డి 2019లో కాంగ్రెస్‌లో చేరి రంజిత్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రత్యర్థులిద్దరూ మరోసారి పోటీపడటం విశేషం.
టార్గెట్ @ 15 - ప్రచారంలో జోష్ పెంచిన కాంగ్రెస్ - LOK SABHA POLLS 2024