ETV Bharat / politics

ఏం చేశారో చెప్పకుండా - విపక్షాలపై విమర్శలకే పరిమితమైన సీఎం జగన్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 4:58 PM IST

CM YS Jagan Public Meeting at Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన తీవ్రంగా విఫలమైంది. ఓ వైపు సీఎం విమర్శలు చేస్తుంటే, మరోవైపు మందుబాబులు చిందులు వేశారు. వీటన్నింటి నడుమ సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే మహిళలు సభ నుంచి బయటకు వచ్చేశారు.

CM_YS_Jagan_Public_Meeting_at_Uravakonda

CM YS Jagan Public Meeting at Uravakonda: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సైతం కేవలం విమర్శలకు మాత్రమే సీఎం జగన్ పాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చెప్పాల్సింది పోయి, విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం సభలకు మహిళలను భయపెట్టి తీసుకొని వస్తున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే సీఎం సభ ప్రాంగణం ఎదుటే వైసీపీ కార్యకర్తలు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు తాగుతూ, సభ ప్రాంగణంలోకి వెళ్లారు. సీఎం జగన్ సభతో తమకేమీ సంబంధం లేదంటూ వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో తేలిపోయారు. కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు విచ్చలవిడిగా తీసుకొచ్చి సేవించారు.

ప్రచార పిచ్చి- అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలోనూ సీఎం జగన్​పై నేతల ఆహా ఓహో!

CM Jagan Comments in Uravakonda: నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించారు. వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడత నిధులు విడుదల చేశారు. అయితే ఎప్పటిలాగే ఈ సభలో సైతం సీఎం కేవలం విమర్శలకు మాత్రమే తన ప్రసంగంలో సమయం కేటాయించారు. కనీసం రాష్ట్ర పరిస్థితి గురించి ఒక్క మాట్లాడలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు చాలా మంది స్ఠార్ క్యాంపెయినర్లు ఉన్నారని అన్నారు.

చంద్రబాబు క్యాంపెయినర్లంతా పక్క రాష్ట్రంలోనే ఉంటారన్న సీఎం, పవన్‌ కల్యాణ్​ సైతం చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌ అని పేర్కొన్నారు. చంద్రబాబు వదిన కూడా ఆయనకు స్టార్‌ క్యాంపెయినరే అని విమర్శించారు. ఆమె పక్క పార్టీలోకి వెళ్లినా క్యాంపెయిన్ మాత్రం చంద్రబాబుకే అని అన్నారు.

అదే విధంగా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లినవాళ్లు కూడా బాబు క్యాంపెయినర్లే అని సీఎం జగన్ మండిపడ్డారు. బీజేపీలో తలదాచుకున్న పసుపు కమలాలు బాబు క్యాంపెయినర్లే అన్న సీఎం, అనేక పార్టీల్లో చంద్రబాబు బినామీలు స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉన్నారని ధ్వజమెత్తారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో మేలు జరిగిన ప్రతిఒక్కరూ తన క్యాంపెయినర్లు అని సీఎం చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తన స్టార్ క్యాంపెయినర్లు అని తెలిపారు.

సీఎం సభతో సామాన్యులకు తప్పని తిప్పలు - బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు

మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడటం ప్రారంభించిన వెంటనే మహిళలు సభ నుంచి బయటకు వచ్చేశారు. పోలీసులు మహిళలను నిలువరించినా బారికేడ్లను దాటుకుని బయటకు వచ్చారు. ఒక్కసారిగా మహిళలు బయటకు వచ్చేయడంతో పోలీసులు సైతం నిలువరించలేకపోయారు. ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా మరోపక్క మహిళలు బయటకు జారుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.