Police Once again Give Notices to Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ లేకపోవడంతో ఆయన మేనేజర్ కరుణాకర్‌కు అందజేశారు. ఆసుపత్రికి ఎప్పుడొచ్చినా తమకు సమాచారం ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ పరామర్శకు వచ్చినా గంట లోపు ఈ ప్రక్రియ అంత పూర్తయ్యేలా చూసుకోవాలని, సందర్శన అంతా గోప్యంగా ఉంచాలని పోలీసులు తెలిపారు. కిమ్స్‌కు ఎప్పుడు వచ్చినా అల్లు అర్జున్‌కు ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని ఇందుకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించకుండా అకస్మాత్తుగా సందర్శనకు వస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని పోలీసులు నోటీసుల్లో తెలిపారు.
ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాలి: మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీ తేజను అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లాలనుకున్న నేపథ్యంలో రాంగోపాల్‌పేట పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి రావద్దంటూ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఆసుపత్రికి వస్తే మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందని వివరించారు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్లలేదు.
స్టేషన్లో సంతకం: సంధ్య థియేటర్ కేసులో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం పీఎస్ ముందు హాజరుకావాలని ఆదేశాాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను జనవరి 3వ తేదీ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని నాంపల్లి కోర్టు ఆదేశాలలో పేర్కొంది. ఈ క్రమంలో చిక్కడపల్లి పీఎస్‌లో హజరై సంతకం చేసి అల్లు అర్జన వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
Allu Arjun Reaction : ఈ ఘటనపై అల్లు అర్జున్ సైతం పలుమార్లు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను ఎలాంటి ర్యాలీ చేయలేదని థియేటర్ కొద్ది దూరంలో కారు ఆగిపోవడంతో, ముందుకు కదల్లేని పరిస్థితిలో చేయి చూపిస్తూ ముందుకు కదలండని అన్నానని చెప్పుకొచ్చారు.
చిక్కడపల్లి పీఎస్‌లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ - ఆ అంశాలపై ఆరా
'అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - లోపలికి చొరబడి పూలకుండీలు ధ్వంసం'