ETV Bharat / politics

ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్​​రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha - CM REVANTH IN JANA JATHARA SABHA

CM Revanth Speech at Narayanapet Jana Jathara Sabha :తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్, మోదీ కాళ్ల వద్ద తాకట్టుపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్​ఎస్​ ఓట్లన్నీ బీజేపీకు మళ్లించాలని, కేసీఆర్ చెప్తున్నారని అన్నారు. నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి, ముదిరాజ్​లను బీసీ-డీ నుంచి బీసీ- ఏ గ్రూప్​లోకి మార్చేందుకు, సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతామని చెప్పారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందేనన్న ఆయన, భవిష్యత్​లో మాదిగలకు మరిన్ని పదవులు ఇస్తామన్నారు.

Congress Jana Jathara sabha Narayanpet
CM Revanth Fires on BRS Party
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 8:32 PM IST

Updated : Apr 15, 2024, 10:14 PM IST

CM Revanth Speech at Narayanapet Jana Jathara Sabha : పార్లమెంట్​ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10శాతంగా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్‌(KCR) పదేళ్ల పాలనలో ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను బీసీ-డీ కేటగిరి నుంచి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు.

నారాయణపేటలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ జనజాతర సభ’కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్​ రెడ్డి, ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరోవైపు మాదిగల వర్గీకరణ(Madigala Classification) చేయాల్సిందేనని, వాళ్లకు న్యాయం జరగాల్సిందేని రేవంత్​ పేర్కొన్నారు. భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. నారాయణపేట మున్సిపాలిటీకి భూగర్భ డ్రైనేజీ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు రైతులకు నష్టం కలిగిస్తే - కఠిన చర్యలు తప్పవు : సీఎం రేవంత్ రెడ్డి - CM Tweets On paddy procurement

ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ : కేసీఆర్‌ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారన్న రేవంత్​రెడ్డి, పాలమూరు బిడ్డ, పేదోడి బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. దొరలు మాత్రమే కుర్చీల్లో కూర్చోవాలా, పేద బిడ్డలు కూర్చోవద్దా అంటూ ఆయన నిలదీశారు. జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్​, గులాబీ పార్టీని మోదీకి తాకట్టుపెట్టారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద ఉంచారన్న ఆయన, బీఆర్​ఎస్​ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్‌ చెబుతున్నారని దుయ్యబట్టారు. వందరోజులకే తనని గద్దె దించాలని కేసీఆర్‌ అంటున్నారు. కానీ పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీని(PM Modi) గద్దె దించాలని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం, ఎన్నికల కోడ్‌ ఉన్నందునే రుణమాఫీ చేయలేకపోయామన్నారు. వచ్చేసారి వడ్లకు రూ.500 బోనస్‌ తప్పకుండా ఇస్తామని ప్రకటించారు.

"ఇవాళ ఎన్నికల కోడ్​ రావటం వల్ల రైతు రుణమాఫీ చేయలేకపోయాను. అందుకే నారాయణపేట గడ్డపై నుంచి తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, ఆగస్టు 15 తేదీ లోపల రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాను. ఎట్లైతే కొడంగల్​ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసానో, ఎట్లైతే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించానో అదేవిధంగా ఏకకాలంలో, ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది."-రేవంత్​రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

Revanth Reddy Fires on BJP : రేవంత్‌ రెడ్డిని ఊడగొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటున్నారన్న సీఎం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని ఆమె ఎప్పుడైనా మోదీని అడిగారా అని ప్రశ్నించారు. మక్తల్‌- వికారాబాద్‌ రైల్వే లైన్‌ కావాలని ఎప్పుడైనా డిమాండ్‌ చేశారా అని ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్‌ ఎంతమందికి డబుల్​ బెడ్​రూం ఇళ్లు(Double Bedroom Houses) ఇచ్చారో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించామని వివరించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులివ్వాలనే ఉద్దేశంతో, వారికి న్యాయం చేసేందుకే బీసీ కులగణనకు తీర్మానం చేశామని పేర్కొన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లపాటు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని విమర్శించారు.

రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిని చేస్తా : రేవంత్​​రెడ్డి

అప్పుడు షైన్​ ఇండియా - ఇప్పుడు వికసిత్​ భారత్​ - హిస్టరీ రిపీట్​ అవుద్ది : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth Reacts on BJP Manifesto

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు : రేవంత్​ రెడ్డి - REVANTH REDDY on paddy procurement

Last Updated : Apr 15, 2024, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.