ETV Bharat / politics

రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణనలో జాప్యం : సీఎం రేవంత్ - CM Revanth Jana Jatara Sabha - CM REVANTH JANA JATARA SABHA

CM Revanth Election Campaign in Dharmapuri : కేంద్రంలోని బీజేపీ సర్కార్​ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్‌కు తరలించుకుపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధర్మపురిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం, పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల పోటుకు దోహదపడుతుందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లే ప్రధాన అంశంగా ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు.

Congress Election Campaign in Telangana
CM Revanth Jana Jatara Sabha in Dharmapuri (ETV BHARAT)
author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 7:45 PM IST

Updated : May 3, 2024, 10:17 PM IST

CM Revanth Jana Jatara Sabha in Dharmapuri : 2021లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ జనాభా లెక్కలు చేయకపోవడంలో ఆంతర్యమేంటని, కులగణన ఎందుకు చేయలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిలదీశారు. రిజర్వేషన్ల రద్దు కోసమే కులగణనలో జాప్యం వహించారన్న సీఎం, పార్లమెంట్‌లో కమలం పార్టీకి మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి, సిరిసిల్ల జనజాతర సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, కరీంనగర్ లోక్​సభ అభ్యర్థి వెలిచాల రాజేశ్వర్‌రావుకు మద్దతుగా ఆయా ప్రచారసభల్లో ప్రసంగించారు.

రాష్ట్రంపై బీజేపీది సవతి తల్లి ప్రేమ : కేంద్రంలోని బీజేపీ సర్కార్​ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్‌కు తరలించుకుపోయిందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్న ఆయన, ఈసారి కాషాయ పార్టీకి ఓటేస్తే రాజ్యాంగమే ప్రమాదంలో పడుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తేనే రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేసారు.

బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డ సీఎం, మోదీ వాట్సాప్‌ వర్సిటీలో అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ, ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విభజనచట్టంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేశారన్నారు. కాజీపేటకు ఇచ్చిన రైల్వే కోచ్‌ కర్మాగారాన్ని లాతూర్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు.

"గుజరాత్‌కు మాత్రం బుల్లెట్‌ రైలు, సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల నిధులు తరలించుకు పోయారు. గుజరాత్‌లో ఉన్నవారేనా? తెలంగాణలో ఉన్న వాళ్లు మనుషులు కాదా? ఈ రాష్ట్రంపై బీజేపీ నేతలు, దేశ ప్రధాని సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

PCC Chief Revanth Fires on BJP : కులగణన చేపట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందన్న సీఎం, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందుకే 400 సీట్లు కావాలంటోందని, గెలిస్తే లోక్‌సభలో మూడో వంతు మెజార్టీతో రిజర్వేషన్లు రద్దు చేస్తారని వ్యాఖ్యానించారు.

రిజర్వేషన్ల రద్దు కోసమే కులగణనలో జాప్యం : సీఎం రేవంత్ (ETV BHARAT)

రిజర్వేషన్ల రద్దుకు దేశంలోని 50శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను పడగొట్టి కమలం దళం ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రిజర్వేషన్లు పెంచేందుకు దోహదపడుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ అంటే బిర్లా రంగా సమితి : 2022లో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్‌ చెప్పారని, రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చూస్తు ఊరుకుందామా అని సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే బిర్లా రంగా సమితి అని సీఎం ఎద్దేవా చేశారు. డిసెంబర్‌లో జరిగిన సెమీఫైనల్స్ ఎన్నికల్లో బిర్లా రంగా సమితిని ఓడించామని, అదే స్ఫూర్తితో ఫైనల్స్​లో మోదీ, అమిత్​షాలను ఓడించాలని పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ యత్నిస్తుంటే ట్విటర్‌ టిల్లు ఎందుకు ప్రశ్నించటం లేదని కేటీఆర్​నుద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నికల తర్వాత కమలంతో కలవడానికి గులాబీ సిద్ధమైందని ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్‌లో కాషాయ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందన్నారు. కవిత బెయిల్‌ కోసం మోదీ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్నికేసీఆర్‌ తాకట్టు పెట్టారని విమర్శించారు.

"బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడబలుక్కొని, కుమ్మక్కై చీకటి ఒప్పందంతో నడుస్తున్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంటే అక్కడ ఒకరికొకరు సహకరించుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు. కరీంనగర్​లో సైతం అదే పరిస్థితి ఉంది. కేసీఆర్ కుమార్తె బెయిల్ కోసం తెలంగాణను మోదీకి తాకట్టు పెడుతున్నారు."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడబలుక్కొని, కుమ్మక్కై చీకటి ఒప్పందంతో నడుస్తున్నాయి (ETV BHARAT)

బీజేపీకి వేసే ప్రతి ఓటు - రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది : రేవంత్ రెడ్డి - lok sabha elections 2024

ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి : సీఎం రేవంత్ - CM Revanth Road Show at Siddipet

Last Updated : May 3, 2024, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.