ETV Bharat / politics

చేవెళ్ల లోక్‌సభలో త్రిముఖ పోరు - అభ్యర్థులకు అండగా సతీమణుల ప్రచారం - Chevella Election Campaign 2024 - CHEVELLA ELECTION CAMPAIGN 2024

Chevella MP Candidate Wifes Campaign 2024 : ఓట్ల పండగ వచ్చిందంటే ఊరంతా రాజకీయాలే. ఓ వైపు అభ్యర్థులు మరోవైపు వారి కుటుంబ సభ్యులు ఓట్ల కోసం పడే పాట్లు అన్నీఇన్నీ కావు. చేవెళ్ల లోక్‌సభ స్థానానికి పోటీపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంతో దూసుకుపోతుండగా వాళ్ల సతీమణులు సైతం రంగంలోకి దిగారు. భర్త గెలుపు కోసం మండుటెండల్లో చెమడోస్తున్నారు. మా ఆయనకే ఓటు అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Chevella Election Campaign 2024
Chevella MP Candidate Wifes Campaign 2024
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 7:09 AM IST

చేవెళ్ల లోక్‌సభలో త్రిముఖ పోరు - అభ్యర్థులకు అండగా సతీమణుల ప్రచారం

Chevella Election Campaign 2024 : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం గెలుపును కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆ పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అంటూ సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. వారికి తోడుగా వాళ్ల సతీమణులు రంగంలోకి దిగి భర్తల గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 'నేను ఫలాన పార్టీ అభ్యర్థి భార్యను మీ ఓటు మా ఆయనకే వేయాలని' కరపత్రాలు పంచుతూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు. ఇంతకు ముందు వారిని చూడని ఊరి జనాలు ఆమె ఫలాన ఆయన భార్య అని ఓట్ల కోసం వచ్చారంటూ గుసగుసలాడుకుంటున్నారు.

ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి ప్రచారం : చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి భర్త గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సర్కార్‌ అమలు చేసిన గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రజల కోసం తపించే తన భర్త రంజిత్‌ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని సీతారెడ్డి కోరుతున్నారు.

చేవెళ్ల లోక్​సభ స్థానాన్ని 'హస్త'గతం చేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తు - Lok Sabha Election 2024

బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి ప్రచారం : బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి సైతం భర్త తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, గేటెడ్ కమ్యునిటీల్లోని ప్రజలతో ప్రత్యేక సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ విశ్వేశ్వర్ రెడ్డి విజన్‌ గురించి వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో కుట్ర చేసి తన భర్తను ఓడించారన్న సంగీతరెడ్డి ఈసారి ఆ తప్పు జరగకుండా బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు.

కాసాని జ్ఞానేశ్వర్‌కు తోడుగా ఆయన సతీమణి : బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు తోడుగా ఆయన సతీమణి చంద్రకళ, కుమారుడు వీరేశ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాల్లో కార్యకర్తలతో కలిసి చంద్రకళ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపించాలని కోరుతున్నారు.చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సతీమణుల ప్రచారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇల్లాలి ప్రచారం భర్తకు ఎన్ని ఓట్లు తీసు కొస్తుందో వేచిచూడాలి.

చేవెళ్ల లోక్​సభలో త్రిముఖ పోరు - మరి నెగ్గేదెవరో! - CHEVELLA LOK SABHA ELECTION 2024

400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోంది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth on Modi and KCR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.