ETV Bharat / politics

పథకాల పేరిట తెస్తున్న అప్పులు ఏం చేస్తున్నారు? - మహిళలకు ఇచ్చిన హమీలు ఏవీ? : కిషన్ రెడ్డి - KISHAN REDDYON CONGRESS GUARANTEES - KISHAN REDDYON CONGRESS GUARANTEES

BJP Strike At Dharna Chowk in Hyderabad : పథకాల పేరిట తెస్తున్న అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు అనేక హమీలు ఇచ్చి ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.

Central Minister kishan Reddy on Congress Guarantees to Women
Central Minister kishan Reddy on Congress Guarantees to Women (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 1:53 PM IST

Kishan Reddy on Congress Guarantees to Women : అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు అనేక హమీలు ఇచ్చి మాట తప్పిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి తప్పించుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హాజరయ్యారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్నారు, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. 18ఏళ్లు నిండిన మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, వివాహం చేసుకునే మహిళలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్​లో ఫార్మా సూటికల్​​ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా : కిషన్​ రెడ్డి - Kishan Reddy On Pharma Sector

'వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ ఎప్పటి నుంచి ఇస్తారు? ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నా మహిళలకు న్యాయం జరగలేదు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాం. నరేంద్ర మోదీ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత మేము తీసుకున్నాం. హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తాం.' అని కిషన్ రెడ్డి అన్నారు.

హామీల పేరిట అధికారంలో వచ్చిన కర్ణాటకలో కూడా హామీలు అమలు చేయట్లేదని కిషన్ రెడ్డి తెలిపారు. హామీల అమలు పేరుతో ప్రభుత్వం ప్రజల సొమ్ము దోచుకుంటుందని, రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారని, అది రాహుల్‌ పర్యటనల కోసం ఉపయోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

"మహిళలపై సీఎం రేవంత్​కు గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మూసివేయాలి. స్వరాష్ట్రం వచ్చి పదేళ్లైనా కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. కొత్త రేషన్‌ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు? రేషన్‌ కార్డు లేకపోవడంతో మహిళలు గ్యాస్‌ కనెక్షన్లు తీసుకోలేకపోతున్నారు. కొత్త రేషన్‌ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మోదీ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. రేషన్‌ కార్డు ఉంటే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తిస్తుంది. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా తెలంగాణ పేరుమీద రేషన్‌ ఇచ్చుకోలేని దురవస్థలో ఉన్నాం". - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

'నూతన న్యాయ చట్టాలపై కొందరివి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు' - Kishan Reddy on New Laws

సింగరేణిని అప్పులు పాలు చేసిన ఘనత కేసీఆర్​దే : కిషన్​రెడ్డి - singareni mines issue

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.