Central Minister Kishan Reddy on Union Budget 2024 : ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పైన మాట్లాడిన ఆయన దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు.
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం : 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్'లో భాగంగా పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కోటిమంది పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించిందని తెలిపారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే కేంద్రం లక్ష్యం పెట్టుకుందని వివరించారు.
The NDA's 11th consecutive full budget and its first in the 3rd term has focussed entirely on
— G Kishan Reddy (@kishanreddybjp) July 23, 2024
- empowering the Garib
- Leveraging the power of Youth
- Transforming the productive capabilities of our Annadata
- Empowering the resilience and shakti of the Nari
- Honoring our… pic.twitter.com/BwOtpBBt5p
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం : కేటీఆర్ - KTR On Central Budget Funds
"వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో పెట్టాం. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేసింది మోదీ సర్కారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా పన్ను స్లాబ్‌లను మార్చింది. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరగనుంది." - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
MLA Alleti Maheshwar Reddy Union Budget : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్‌గా అభివర్ణించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దేశ యువతకు పెద్దపీట వేసిందని కొనియాడారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో రేవంత్ రెడ్డినే అడగాలన్నారు. రేవంత్ రెడ్డి అతని గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీతో ఎలాంటి అర్జీలు, విన్నపాలు చేసుకున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నడపలేని స్థితిలో ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆక్షేపించిన ఆయన అసెంబ్లీని నాలుగు రోజులు నడపడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బీఏసీ సమావేశంలో 18రోజులు సభ నడపాలని కోరడంతో పాటు 18అంశాలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని విమర్శించారు.