KTR Warning On BRS Party Merge Rumours : భారత రాష్ట్ర సమితిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఘాటుగా స్పందించారు. నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
24 Years of Resilience and Devotion!
— KTR (@KTRBRS) August 7, 2024
Against Hundreds of Saboteurs,
Standing up Against Thousands of Malicious Propagandists & Schemes!
For 24 Years!
And yet, we prevailed. We fought tirelessly, and we achieved and built a state that has become a beacon of progress and pride. A…
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమది అన్న ఆయన, అన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని వివరించారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపినట్లు పేర్కొన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లు కేటీఆర్ తెలిపారు.
కోట్లాది గొంతుకలు, హృదయాలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటం వల్లే సాధ్యమైందని అన్నారు. ఎప్పటిలానే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని, పోరాడుతుందని చెప్పారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. పడతాం, లేస్తాం తెలంగాణ కోసమే పోరాడుతామన్న కేటీఆర్, ఏనాటికీ, ఎప్పటికీ తలవంచబోమని స్పష్టం చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. పెట్టుబడుల పేరిట షెల్ కంపెనీలు, స్కాంగ్రెస్ ఎత్తుగడలతో ప్రజలను ఫూల్ చేస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. దావోస్లో గోడి పేరుతో ఉన్న కంపెనీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు నెల రోజుల్లోపు స్వచ్చ బయో కంపెనీగా మార్చారన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇలాంటివి ఇంకా చాలా వస్తాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెనక మతలబు ఇదేనని గులాబీ నేత ఆరోపించారు.
Shell companies & Scamgress tactics to fool people in the name of investments
— KTR (@KTRBRS) August 7, 2024
Early this year in Davos, it was Godi and now it’s SwachhBio that was incorporated by brother of CM Revanth less than a month ago!!!
This is just the beginning. Brace for many more
Great expose… https://t.co/3CpXLZ6hyM