ETV Bharat / politics

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - హస్తం పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న గులాబీ నేతలు - పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్

BRS Target on Parliament Elections 2024 : పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్ల గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్న బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తుంది. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ ముఖ్యనేతలు, ఆరు గ్యారెంటీల అమలేదంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్​ను మట్టికరిపిస్తామని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని గులాబీ నేతలు తేల్చి చెబుతున్నారు.

BRS Fires on Congress Party
BRS Target on Parliament Elections 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 10:26 PM IST

BRS Target on Parliament Elections 2024 : ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని దిల్లీ మేనేజ్​మెంట్ కోటాలో(Delhi Management Quota) సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉపాధిలేక రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే కేటీఆర్(MLA KTR) డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా జరిగిన గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్‌ తప్పుబట్టారు. తమ అధినేత కేసీఆర్‌ అధికారంలో కన్నా విపక్షంలో ఉండడమే చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆరఎస్​ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయన్న కేటీఆర్‌, అది ఎప్పటికీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, దిల్లీ ద్వారా మేనేజ్​మెంట్ కోటాలో అక్కడకు వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్నారు. తప్పా ప్రజలంతా ఎన్నుకుంటే వచ్చింది కాదు. గులాబీ అధినేత కేసీఆర్ అధికారంలో కన్నా విపక్షంలో ఉంటేనే చాలా ప్రమాదం. ఎందుకంటే అద్భుతంగా ప్రజల పక్షాన చీల్చిచెండాలగలిగిన పటిమ ఉన్నోడు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు బహుషా దేశంలోనే ఎక్కడా లేదు.-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు పూటకో అంశాన్ని తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు. మెదక్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చేసిన మంచిపని ప్రజల్లోకి వెళ్లలేదని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ అబద్దపు ప్రచారాలతోనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇవాళ 24 గంటల కరెంట్ అన్నారు. కానీ ఎక్కడా కూడా పద్నాలుగు, పదహారు గంటల కంటే ఎక్కువ రావటం లేదు. మేము రాగానే డిసెంబర్ 09న తొలి సంతకం రెండు లక్షల రుణమాఫీపై పెడుతున్నా అన్నారు. కానీ దానిపై ఆలోచనే నేడు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లోపు వడ్ల బోనస్ మీద జీవో, ఈనెల నాలుగు వేల పెన్షన్, అలాగే రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించు. రూ.2500 మహిళల ఖాతాల్లో జమచేస్తామన్నది కూడా ఇప్పటివరకూ రాకపోయే.-హరీశ్​రావు, మాజీ మంత్రి

BRS Fires on Congress Party : అమలుకాని హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. తెలంగాణకు దేశంలో అత్యున్నత స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది కేసీఆరే అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ రమణ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - హస్తంపై విరుచుకుపడ్డ గులాబీ నేతలు

హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ - అధికారం చేతుల్లోనే ఉందిగా వెలికితీయండి : కేటీఆర్‌

నాడు ప్రచారంలో అబద్ధాలు - నేడు పాలనలో అసహనం : హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.