KTR Fires on CM Revanth Over Party Defections : ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే, రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు అందుకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రచారంలో నీతులు? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా? అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని, భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమని నాడు అన్నారని గుర్తు చేశారు. చివరికి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా చేరితే ఊళ్ల నుంచే తరిమికొట్టమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు.
KTR Reacts on Party Defections : అలా అన్నవారే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా అని ప్రశ్నించారు. జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి, ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారని, ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి? అని అడిగారు.
ముఖ్యమంత్రి గారు..
— KTR (@KTRBRS) June 25, 2024
ప్రచారంలో నీతులు..?
ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?
నాడు..
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు.
ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు.
భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు.
చివరికి...
ఎమ్మెల్యేలు పార్టీ మారితే… pic.twitter.com/iraQWtewv1
దశాబ్దాలు గడిచినా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీ దాడి కొనసాగుతోంది : కేటీఆర్
ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా? - సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ - KTR LETTER TO CM REVANTH REDDY