ETV Bharat / politics

"2 పేపర్లపై ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి - జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు" - BRS Protest Against On Job Calendar

BRS Protest Against on Telangana Job Calendar : జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్​ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళన చేసిన కేటీఆర్‌, 2 పేపర్లపై ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి జాబ్‌ క్యాలెండర్ అంటున్నారని ఆక్షేపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని కోరితే, తమకు 2 నిమిషాలు కూడా మైక్‌ ఇవ్వలేదన్నారు. తెలంగాణ శాసనసభ దుశ్శాసనసభగా మారిందని హరీశ్​రావు ధ్వజమెత్తారు.

BRS Leaders Dharna at Hyderabad
KTR Fires on Congress About Job Calendar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 8:11 PM IST

Updated : Aug 2, 2024, 10:23 PM IST

KTR Fires on Congress About Job Calendar : కాంగ్రెస్‌ సర్కార్​ జాబ్‌ క్యాలెండర్‌తో యువతను మభ్య పెడుతోందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌ విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ శాసనసభ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ వద్ద బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, జాబ్‌ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదన్నారు. రెండు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్‌ క్యాలెండర్‌ అంటున్నారని విమర్శించారు.

"నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. నాడు జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని ప్రకటనలు చేశారు. రాహుల్‌ గాంధీ, 2లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎక్కడ? సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అశోక్‌నగర్‌ రావాలి, మేము కూడా వస్తాము. నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే, మా ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసి అక్కడే పెట్టి పోతాం. దొంగచాటున ఏదో రాసుకుని వచ్చి జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. రాష్ట్ర యువత తరఫున పోరాడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్‌ ఇచ్చి శాసనసభను కౌరవ సభగా మార్చారు."-కేటీఆర్​, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Harish Rao Protest Against Assembly Proceedings : శాసనసభ దుశ్సాసన సభగా మారిందని బీఆర్​ఎస్​ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం తప్పు ఎత్తి చూపితే మైకు కట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. కన్న తల్లులను అవమానపరిచేలా ఒక శాసన సభ్యుడు మాట్లాడితే మైక్‌ ఎందుకు కట్‌ చేయరని ప్రశ్నించారు. దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారముందని అసెంబ్లీలో మా గొంతు నొక్కితే, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వెల్లడించారు.

"కాంగ్రెస్ పార్టీ మోసాల పరంపరకు పాల్పడుతోంది. బడే భాయ్, చోటా భాయ్​లాగా సభలో బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని పనిచేస్తున్నాయి. ఇవాళ రిలీజ్​ చేసింది జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ద్రోహం, దగా చేసింది. కాంగ్రెస్ నేతలను నిలదీయాలని నిరుద్యోగులకు పిలుపునిస్తున్నాం. శాసనసభను కౌరవ సభలా జరుపుతూ మందబలంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వారిని ఎండగడతాం"-హరీశ్​రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత

48 గంటల్లో నాలుగు అత్యాచార ఘటనలా? - నిజంగా సిగ్గుచేటు : కేటీఆర్​ - ktr twwet on women safety in tg

ఉపాధ్యాయులకు పీఆర్​సీ ఎప్పుడు ప్రకటిస్తారు? - సీఎం రేవంత్​కు హరీశ్ రావు లేఖ - Harish Rao Letter to cm Revanth

Last Updated : Aug 2, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.