BRS MLC Kavitha Interim Bail Petition Verdict : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
BRS MLC Kavitha Interim Bail Denied : ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏప్రిల్ 4న ఉత్తర్వులు రిజర్వ్ చేసి ఇవాళ తీర్పు వెలువరించింది. మరోవైపు కవితకు మధ్యంతర బెయిల్‌ను ఈడీ (MLC Kavitha ED Arrest) వ్యతిరేకిస్తోంది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని వివరించింది. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందిరిని ఆమె బెదిరింపులకు గురి చేశారని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఈడీ కోర్టును కోరింది.
ED On MLC Kavitha Bail Petition : ఈడీ కోర్టుకు కవిత గురించి ప్రస్తావిస్తూ దిల్లీ మద్యం కుంభకోణానికి (Delhi Excise Policy Scam) కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ, ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు వివరించింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఆమె 10 ఫోన్లు ఇచ్చినా, అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపింది. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్‌లను ధ్వంసం చేశారని కోర్టుకు వెల్లడించింది.
MLC Kavitha Petition On Regular Bail : మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ఈ నెల 20వ తేదీన విచారణ చేపట్టనుంది. దిల్లీ మద్యం కేసులో ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తిహాడ్ జైలులో జ్యూడిషియల్ కస్ట్‌డీలో ఉన్నారు. మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమెను రేపు మరోసారి కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశముంది. మరోవైపు కవితను ప్రశ్నించేందుకు ఇప్పటికే సీబీఐ (CBI To Investigate Kavitha) కోర్టు అనుమతి పొందిన విషయం తెలిసిందే.