ETV Bharat / politics

బీఆర్​ఎస్​ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు - ఇక మిగిలింది అదే! - Congress focus on merger of BRSLP

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 6:54 AM IST

Updated : Jun 22, 2024, 7:03 AM IST

Congress Focus on BRS MLAs Joinings : రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైన చేరికలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీఆర్​ఎస్​ నుంచి మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో చేరికలపై బీఆర్​ఎస్​ నేతలు భగ్గుమంటున్నారు.

Congress Focus on BRS MLAs Join
Congress Focus on BRS MLAs Join (ETV Bharat)

BRS MLAs Joins Congress in Telangana : రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ 64 కాంగ్రెస్​ పార్టీ దక్కించుకుని అధికార పగ్గాలు చేపట్టింది. బీఆర్​ఎస్​ 39 స్థానాలతో ప్రతిపక్షంగా నిలిచింది. బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒకటి లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్​ బలం 65కు చేరింది.

ఇటీవల స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి హస్తం పార్టీలో చేరడంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల సంఖ్య 34కు తగ్గింది. ఇంకా ఉప్పల్​ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన కూడా త్వరలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చేరికలకు అధిష్ఠానం గ్రీన్​ సిగ్నల్ : కాంగ్రెస్​లో చేరికలు జరగడానికి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంలో జాప్యం చేసినట్లయితే చేజారిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్​ సీనియర్​ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పెంచుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని పీసీసీ ప్లాన్ చేస్తుంది​. ఇదే విషయాన్ని కాంగ్రెస్​ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి చేరికలకు గ్రీన్​ సిగ్నల్​ తెచ్చుకున్నట్లు సమాచారం.

20 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ టచ్​లో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు అందరు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అదే జరిగితే బీఆర్​ఎస్​లో ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్​రావు లాంటి ముగ్గురు నలుగురు మినహా అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని దానం నాగేందర్ జోస్యం చెప్పారు.

ఇదే అంశంపై స్పందించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్ చేరికలకు తాము ప్రయత్నించడం లేదని, చేరేందుకు చొరవ చూపే వాళ్లను చేర్చుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని చేర్చుకునే దిశలో పీసీసీ నాయకత్వం చొరవ చూపుతోంది. ఇలా చేర్చుకుంటూ పోతే మూడు వంతుల్లో రెండు వంతులు అంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత బీఆర్​ఎస్​ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే దిశలో ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

చేరికలపై భగ్గుమన్న బీఆర్​ఎస్​ నేతలు : బీఆర్​ఎస్​ నేతలు కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. బీఆర్​ఎస్​ ఖాళీ అవుతుందని దానం నాగేందర్ పరిధులు దాటి మాట్లాడారని ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మండిపడ్డారు. తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని దానం చూస్తున్నారన్న ఆయన, రాజకీయాల్లో నాగేందర్ చాప్టర్ ఖతం అయినట్లేనని వ్యాఖ్యానించారు.

పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడని సంబోధిస్తూ, అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తమకు ఆదర్శంగా చూపిస్తూ పోచారం గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేశారు. అధికారం, పదవులు లేకుంటే బతకలేమా, ఈ వయసులో పార్టీ మారడం మీకు భావ్యమా అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నైతిక విలువలు ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలన్నారు. ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి తాను బరిలో దిగి తేల్చుకుందామని బీఆర్​ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సవాల్ చేశారు.

బీఆర్​ఎస్​ నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట : అటు బీఆర్​ఎస్​ నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 12 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలో పోలీసులు బీఆర్​ఎస్​ నేత బాల్కసుమన్‌, పలువురు గులాబీ కార్యకర్తలను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఠాణాకు తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ సహా 10 మందికి బెయిల్ మంజూరు చేసింది.

బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​ - కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్​ రెడ్డి - CM Revanth Met Pocharam

బీఆర్ఎస్​కు వరుస షాక్​లు - కాంగ్రెస్‌లో భారీ చేరికలు - హస్తంతో టచ్‌లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు! - lok sabha elections 2024

Last Updated : Jun 22, 2024, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.