BRS Leaders to Visit Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో కన్నెపల్లి పంప్ హౌజ్‌ను సైతం చూడనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చి లోయర్ మానేరు డ్యాంను సందర్శించిన బీఆర్ఎస్ బృందం రాత్రి రామగుండంలో బస చేసింది.
రామగుండం నుంచి బయలుదేరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి వెళ్లి కన్నెపల్లి పంప్ హౌజ్‌ను ముందుగా పరిశీలించనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో 10 లక్షల క్యూసెక్కులకు పైన నీరు చేరినా బ్యారేజీ ఠీవిగా నిలబడిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం చిన్న లోపాన్ని సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపిస్తూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌కు వచ్చిన మంచి పేరు పోగొట్టాలని గత ఏడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.
చిన్నపొరపాటును సరిచేయకుండా విమర్శలు : మేడిగడ్డ వద్ద జరిగిన చిన్నపొరపాటును మరమ్మతు చేయకుండా రైతుల గుండెలు మండేలా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో శనివారం అసెంబ్లీ సమావేశాలల్లో వివరిస్తామన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి లోయర్ మానేరు డ్యామ్‌ను సందర్శించిన ఎమ్మెల్యేల బృందం, కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను పరిశీలించనున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని విఫల ప్రాజెక్టుగా చూపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని మేడిగట్ట నిలచిందన్నారు. గత ఎనిమిది నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్ చేయకుండా పంట పొలాలను ఎండబెట్టారని ఆవేదన చెందారు. కాళేశ్వరం నుంచి ప్రతి రోజు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథా పోతున్నా లిఫ్ట్ చేయడం లేదన్న ఆయన ఈ ఏడాది కేవలం 45శాతం వర్షపాతం నమోదు అయిందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరమే కరవును పారదోలే “కల్పతరువు" : కేటీఆర్ - KTR will Visit Medigadda Soon
భవిష్యత్తులో అనుకున్న మేరకు వర్షాలు కురుస్తాయో లేదో అంచనా వేసే పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు. లోయర్ మానేరు, మిడ్ మానేరు సహా ఎండిపోయిన ప్రాజెక్టులను పరిశీలించేందుకే ప్రాజెక్టుల బాట పట్టినట్లు తెలిపారు. 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవీగా నిలబడిందన్న ఆయన లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను సీఎం రేవంత్‌రెడ్డి ఫణంగా పెట్టి పంట పొలాలు ఎండబెడుతున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా రాజకీయాలు మానుకోండి : ఇప్పటికైన కేసీఆర్‌పై రాజకీయ కక్ష కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడవద్దని రేవంత్‌రెడ్డికి సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి రామగుండంలో బసచేసిన ఎమ్మెల్యేల బృందం కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించిన నీటిని ఎత్తిపోతే అవకాశాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పసలేని, దిశలేని, దండగమారి బడ్జెట్ - ప్రభుత్వ పద్దుపై కేటీఆర్ ట్వీట్ - KTR tweet on state budget 2024