ETV Bharat / politics

కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి : కేటీఆర్​

రేవంత్​ రెడ్డి ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది - మూసీ పేరిట లక్ష కోట్లు కొల్లగొట్టారు - హైదరాబాద్​లో ప్రతి ఒక్కరు కేసీఆర్​ లేని లోటును గుర్తు చేసుకుంటున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

BRS Leader KTR Fires on Congress Govt
BRS Leader KTR Fires on Congress Govt (ETV Bharat)

BRS Leader KTR Fires on Congress Govt : రాష్ట్రంలో పండగ మాదిరి లేకుండా పోయిందని ఈసారి దసరా చేసుకునే పరిస్థితి లేకుండా భయానక వాతవరణం సృష్టించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మహ్మద్ అలాఉద్దీన్, పలువురు ఇతరులు తెలంగాణ భవన్​లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చి ఉండేవని కేటీఆర్​ తెలిపారు. బతుకమ్మ ఆడుకునేందుకు లేకుండా డీజేలు కూడా బంద్​ చేశారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని కేటీఆర్​ ఆక్షేపించారు. ఒక డిసెంబరు 9 పోయి మళ్లీ డిసెంబరు 9 వస్తోందని రైతుల రుణాలన్నీ మాఫీ కాలేదని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రేవంత్​ రెడ్డి, రాహుల్​ గాంధీకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తామన్నారు కానీ తులం ఇనుము కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. 1.70 కోటి మంది మహిళల్లో ఒక్కరికి కూడా రూ.2500 రాలేదని ధ్వజమెత్తారు.

మూసీ పేరిట లక్ష కోట్లు దోపిడీ : మూసీ పేరిట లక్ష కోట్లు రూపాయలు కొల్లగొట్టి రాహుల్ గాంధీ, ఆయన బావ, రేవంత్ రెడ్డి పంచుకోవాలని చూస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు. కమిషన్లు రాకపోవడం వల్లే హామీలు అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలు చేయాలని కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నేతలను పట్టుకొని అడగాలని సూచించారు. హర్యానాలో కాంగ్రెస్​కు బుద్ధి చెప్పారని ఆ ఫలితాలు చూసైనా రాహుల్​ గాంధీ, రేవంత్​ రెడ్డి హామీలు అమలు చేయాలన్నారు. హైదరాబాద్ లోని ప్రతి ఒక్కరూ కేసీఆర్ లేని లోటును గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

"కక్షగట్టి తన సోదరి కవితను అరెస్ట్​ చేసి తిహాడ్​ జైళ్లో పెట్టారు. అయినా భయపడకుండా పోరాడుతూనే ఉంటాము. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్​లో రైతులు, ప్రజలకు అండగా నిలబడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డిని దుర్మార్గంగా అరెస్ట్​ చేశారు. రైతులపై లాఠీ ఛార్జ్​ చేశారు. కొడంగల్​లోనే రైతులను ఒప్పించలేని రేవంత్​ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని ఎలా నడుపుతారు. చేతనైతే రైతులను ఒప్పించాలి కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తే ఏం ప్రయోజనం? పట్టనం నరేందర్​ రెడ్డి, నేతలను వెంటనే విడుదల చేయాలి." - కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

2029లో బీజేపీ, కాంగ్రెస్​ మేజిక్​ ఫిగర్​కు దూరం - హర్యానా, జమ్ముకశ్మీర్​ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్​ కేటీఆర్​

'సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా? - పండుగపూటా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా' - KTR Fires on CM Revanth Reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.